న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఒకవైపు కరోనా మహమ్మారి కుదిపేస్తుంటే మరోవైపు తుఫాన్ బీభత్సం ప్రదర్శిస్తోంది. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆంఫన్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా తుఫాను నష్టాన్ని అంచనా వేసి సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది.
Also Read: ప్రభాస్ సరసన అలియా భట్..
తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఆంఫన్ తుపాను పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేయడంతో పాటు కోల్ కతా నగరాన్ని వరద నీరు తీవ్ర స్థాయిలో ముంచెత్తింది. పశ్చిమబెంగాల్లో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించగా, తుఫాను తాకిడికి పశ్చిమబెంగాల్లో 72 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరణించిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండున్నర లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఇదిలాఉండగా ఒడిశాలోనూ ఆంఫన్ తీవ్ర ప్రభావం చూపగా ఒడిశాలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..