Nivar Cyclone crossed the coast in puducherry: న్యూఢిల్లీ: తమిళనాడు (tamil nadu), పుదుచ్చేరి (puducherry) ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న నివర్ తుపాను (Nivar Cyclone) తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటిన అనంతరం అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా (cyclonic storm) మారిందని వాతావరణ శాఖ గురువారం ఉదయం పేర్కొంది. ఈ నివర్ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య తీరం దాటిందని వాతావరణశాఖ వెల్లడించారు. అయితే తీరం దాటిన అనంతరం పెను తుపానుగా మారిన నేపథ్యంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుందని వెల్లడించారు. Also read: Swamy Goud: నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన స్వామిగౌడ్
SEVERE CYCLONIC STORM ‘NIVAR’ WOULD MOVE NORTHWEST WARDS AND WEAKEN FURTHER INTO A CYCLONIC STORM DURING NEXT 03 HOURS.https://t.co/XZd6NinWQK pic.twitter.com/4y5tTIUzBb
— India Meteorological Department (@Indiametdept) November 26, 2020
ఈ నివర్ తుఫాను ప్రభావంతో అటు తమిళనాడు, పుదుచ్చేరిలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు (Heavy Rains) కురిసాయి. తీవ్ర తుపానుగా మారిన నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. భారీగా వీచిన గాలులకు వృక్షాలు సైతం నెలకొరిగాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించాయి. ఎక్కువగా ప్రభావితం అయిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also read: CM KCR: తెలంగాణలో మత విద్వేశాలకు కుట్ర: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి