1,700 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన సంస్థ

1,700 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన సంస్థ

Last Updated : Jul 27, 2019, 12:00 AM IST
1,700 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన సంస్థ

న్యూఢిల్లీ: కార్ల తయారీ రంగంలో దిగ్గజంగా పేరున్న నిస్సాన్ మోటార్స్ భారత్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసింది. టైమ్స్ నౌ న్యూస్ ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు నగరాల్లోని తమ పరిశ్రమల్లో పనిచేస్తోన్న సిబ్బందిని కుదించడం ద్వారా 6,400 మందికి ఉద్వాసన పలకాలని నిసాన్ మోటార్స్ నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే భారత్‌లో 1,700 మందిని పక్కకు పెట్టేందుకు నిసాన్ సిద్ధమైంది. దీంతో చెన్నైలోని రెనాల్ట్-నిసాన్ పరిశ్రమలో పనిచేస్తోన్న వారిలో 1,700 మంది సిబ్బంది ఉద్యోగాలపై కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇదే విషయమై నిసాన్ మోటార్స్ ఇండియా ప్రతినిథులను సంప్రదించే ప్రయత్నం చేయగా వారు స్పందించడానికి నిరాకరించారని టైమ్స్ నౌ న్యూస్ పేర్కొంది.

తమిళనాడులోని రెనాల్ట్-నిసాన్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి 4.8 లక్షల కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమలో ఉద్యోగాల కోత తప్పదన్న చేదు వార్త అందులో పనిచేసే వారికి నిద్ర కరువయ్యేలా చేస్తోంది. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని అక్కడి సిబ్బంది బిక్కుబిక్కుమంటున్నారు.

Trending News