Missionaries of Charity: నోబుల్ బహుమతి గ్రహీత, సెయింట్ మదర్ థెరిసా బ్యాంకు ఖాతాల స్థంభన రాజకీయరంగు పులుముకుంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసలు నిజమేంటనేది తెలుసుకుందాం.
సెయింట్ మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకు చెందిన దేశంలోని బ్యాంకు ఖాతాలన్నింటినీ కేంద్ర హోంశాఖ స్థంభింపజేసిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర హోంశాఖ తీసుకున్న చర్య వల్ల 22 వేలమంది రోగులు, ఉద్యోగులకు మందులు, ఆహారం లేకుండా పోయాయని మమతా ఆరోపించారు. చట్టం సర్వోన్నతమైందే కానీ మానవతా సహాయం విషంయలో రాజీ పడకూడదని మమతా బెనర్డీ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. వేలాదిమంది నిరుపేదలు, అభాగ్యుల వైద్యం, సంక్షేమం కోసం పనిచేస్తున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఖాతాల్ని స్థంబింపచేయడం కలకలం రేపింది. అధికార పార్టీ టీఎంసీతో పాటు సీపీఎం వంటి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించాయి.
ఈ విషయంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతుంటే..కేంద్ర హోంశాఖ స్పందించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ 2011 ప్రకారం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాలంటూ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఈ నెల 25వ తేదీన తిరస్కరించామని కేంద్ర హోంశాఖ (Union Home Ministry) తెలిపింది. ఈ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నిబంధనలు పాటించలేదని కేంద్ర హోంశా తెలిపింది. బ్యాంకు ఖాతాల్ని మాత్రం నిలుపలేదని పేర్కొంది. అయితే ఏయే నిబంధనల్ని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ ఉల్లంఘించిందనే వివరాల్ని స్పష్టం చేయలేదు. వాస్తవానికి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ గడువు అక్టోబర్ 31తోనే ముగిసినా..పెండింగులో ఉన్న దరఖాస్తులకు సంబంధించి ఇతర సంస్థలతో పాటు ఛారిటీ గడువు కూడా డిసెంబర్ 31 వరకూ పొడిగించామని తెలిపింది. రెన్యువల్ నిర్ణయంపై మరోసారి పరిశీలన నిమిత్తం మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నుంచి ఏ విధమైన విజ్ఞప్తి అందలేదని హోంశాఖ వెల్లడించింది.
మరోవైపు ఈ వ్యవహారంపై మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (Missionaries of Charity) స్పందించింది. రిజిస్ట్రేషన్ రెన్యువల్ అంశం పరిష్కారమయ్యేవరకూ బ్యాంకు ఖాతాల్ని వాడవద్దని అన్ని ప్రాంతీయ కేంద్రాల్ని కోరినట్టు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్పష్టం చేసింది. విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్లో లావాదేవీలు నిలిపివేయాలని సూచించింది. తమ బ్యాంకు ఖాతాల్ని స్థంభింపజేయాలని కేంద్ర హోంశాఖ కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. తమవైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకూడదనే ఉద్దేశ్యంతో సమస్య పరిష్కారమయ్యేవరకూ విదేశీ నిధులు జమయ్యే ఖాతాల్ని నిలిపివేసినట్టు పేర్కొంది. కోల్‌కతా కేంద్రంగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ 1950లో స్థాపితమైంది. రోమన్ క్యాథలిక్ మతాధిపతుల శాశ్వత కమిటీ ఇది. ఈ సంస్థ తరపున దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆసుపత్రులు, శరణాలయాలు నడుస్తున్నాయి.
Also read: Congress party Flag: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవంలో..కిందకు పడిపోయిన జెండా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి