Chiranjeevi Receives Padma Vibhushan: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024 యేడాదికి గాను మన దేశంలో దేశ రెండో అత్యున్నత పద్మ విభూషణ్ అవార్డుతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ పద్మభూషణ్‌తో గౌరవించిన సంగతి తెలిసందే కదా. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి ..గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అందుకోవడం విశేషం.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి చిరంజీవి. ఈ అవార్డు కార్యక్రమంలో చిరంజీవి భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసస కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువరు కేంద్ర మంత్రులు తమ బిజీ షెడ్యూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు సీనియర్ నటి వైజయంతి మాల బాలికి కూడా రాష్ట్రపతి పద్మవిభూషణ్‌తో గౌరవించారు.
#PadmaAwards2024 | President #DroupadiMurmu confers #PadmaVibhushan upon Konidela Chiranjeevi in the field of Art@PadmaAwards @rashtrapatibhvn #PadmaAwards pic.twitter.com/IVbE08WbTG
— DD News (@DDNewslive) May 9, 2024
ఈ అవార్డు స్వీకరించేందుకు చిరంజీవి తన కుటుంబ సభ్యులైన భార్య సురేఖ, కుమారుడు కోడలు రామ్ చరణ్, ఉపాసనలతో కలిసి నిన్న సాయంత్రమే ప్రత్యేక విమానంలో దిల్లీ బయలు దేరి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో చిరు..బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులకు తన మద్దతు ప్రకటించారు. చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter