కమల్‌హాసన్ రాజకీయ పార్టీ "స్పెషల్ సాంగ్" విడుదల

దక్షిణాది నటుడు కమల్‌హాసన్ ఇటీవలే ‘మక్కల్ నీధి మయ్యమ్’ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించి.. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.

Last Updated : Apr 6, 2018, 02:04 PM IST
కమల్‌హాసన్ రాజకీయ పార్టీ "స్పెషల్ సాంగ్" విడుదల

దక్షిణాది నటుడు కమల్‌హాసన్ ఇటీవలే ‘మక్కల్ నీధి మయ్యమ్’ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించి.. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. ఫిబ్రవరి 21న మ‌ధురైలోని ఒత్తకాడై గ్రౌండ్‌లో జరిగిన భారీసభలో ఆయన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు.  మక్కల్ నీధి మయ్యమ్ అంటే ప్రజలకు న్యాయం చేసే సంఘం అని అర్థం. ఈ క్రమంలో ఈ రోజే కమల్ హాసన్  పార్టీ గురించి తెలిపే ప్రత్యేక గీతాన్ని యూట్యుబ్‌లో విడుదల చేశారు. ఆ పాటను రాసింది కూడా కమల్ హాసన్ కావడం గమనార్హం. ఆయన ఆ పాటను ఆలపించారు కూడా. జాతీయ పురస్కార గ్రహీత విద్యాసాగర్ ఈ పాటకు సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

Trending News