మధ్య ప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం

12ఏళ్లలోపు ఆమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడితే దోషులకు మరణశిక్ష విధించే చట్టం తీసుకురావాలని మధ్య ప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది.

Last Updated : Nov 26, 2017, 07:43 PM IST
    • మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
    • 12ఏళ్లలోపు అమ్మాయిలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష
    • రాష్ట్ర శిక్షాస్మృతి సవరించే అవకాశం
మధ్య ప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం

మధ్య ప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 12 ఏళ్లలోపు అమ్మాయిలపై అత్యాచారానికి ఒడిగట్టితే మరణశిక్ష విధించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష విధించేలా చట్టం తీసుకురావాలనే తీర్మానానికి ఆమోదం తెలిపింది. మహిళలపై జరుగుతున్న నేరాలు, హింసలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర హోమ్ మంత్రి భూపేంద్ర సింగ్ వెల్లడించారు.  

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మహిళలపై అత్యాచారాలు, వేధింపుల కేసులు భారీగా నమోదైతున్న విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంతో.. రాష్ట్ర శిక్షాస్మృతి సవరించవచ్చు. అందుకు సంబంధిన న్యాయపరమైన చిక్కులను వెంటనే సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Trending News