Bhopal Chlorine Gas Leak: మధ్యప్రదేశ్ లో గ్యాస్ లీక్ కలకలం రేపింది. భోపాల్‌లోని ఒక కాలనీలోని ట్యాంక్ నుండి క్లోరిన్ గ్యాస్ లీకై పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన భోపాల్‌లోని ఈద్గా ప్రాంతంలో ఉన్న మదర్ ఇండియా కాలనీలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే...
భోపాల్‌లోని మదర్ ఇండియా కాలనీలోని వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నుంచి బుధవారం రాత్రి క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. దీంతో చాలా మంది కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈ క్లోరీన్ గ్యాస్ పీల్చి ఇప్పటికే 11 మంది ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఘటనాస్థలిని సందర్శించి, ఆస్పత్రిలో చేరిన వారిని కూడా పరామర్శించారు. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉందని, ప్రజలు భయాందోళన చెందవద్దని మంత్రి అన్నారు.
సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అవినాష్ లావానియా మాట్లాడుతూ.. ట్యాంక్‌లో నుంచి క్లోరిన్ గ్యాస్ విడుదలవడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్లోరిన్ గ్యాస్ లీకేజీ ఎలా జరిగిందో విచారిస్తామని లావానియా అన్నారు. అంతేకాకుండా నగరంలోని అన్ని నీటి శుద్ధి కేంద్రాలను కూడా పరిశీలించనున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ నీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ సమస్య వచ్చిందని ఆయన అన్నారు.
అతిపెద్ద పారిశ్రామిక విపత్తు
1984 డిసెంబరు 2-3 తేదీల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసయినైడ్ అనే వాయువు లీకై వేలాది మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో 5 లక్షల మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనను ప్రపంచంలోనే అతిపెద్ద రసాయన విపత్తుగా పిలుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి