Lok Sabha Session: 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్) అధికారంలోకి వచ్చింది. ఈ నెల 9వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 క్యాబినేట్ ర్యాంక్ మంత్రులుగా కాగా.. 5 ఐదుగురు స్వాతంత్య్ర హోదా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మిగిలిన 36 మంది కేంద్ర సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో ఎక్కువ మంతి కొత్తగా లోక్ సభకు ఎన్నికైన సభ్యులున్నారు. తాజాగా లోక్ సభకు ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ సారి లోక్ సభకు వరుసగా 7 సార్లు ఎన్నికైన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ను ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఆయన లోక్ సభ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా లోక్ సభ పక్ష నేత నరేంద్ర మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత..లోక్ సభ విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత పాలక ఎన్డీయే పక్ష ఎంపీలు.. ఆ తర్వాత ప్రతిపక్షం మిగిలిన పార్టీ సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం రెండు రోజులు పాటు జరగనుంది.
ఈ నెల 26న లోక్ సభ స్పీకర్ కు సంబంధించి ఎన్డీయే క్యాండిడేట్ పేరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించనున్నారు. ఆ తర్వాత మిగిలిన ఎన్డీయే పక్షాలు బలపరచనున్నారు. ఈ సారి లోక్ సభ స్పీకర్ పదవి కోసం పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి.. బీజేపీ ఏపీ అధ్యక్షరాలు.. పురందేశ్వరి లోక్ సభ స్పీకర్ పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు గత బీజేపీ ప్రభుత్వంలో స్పీకర్ గా సభను చాకచక్యంగా నడిపించిన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇస్తారా.. ? వీరిద్దరు కాకుండా మరో వ్యక్తి లోక్ సభ స్పీకర్ గా నియమిస్తారా అనేది చూడాలి. మొత్తంగా లోక్ సభ స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి ఎంపిక చేయనున్నారు. ఈ పదవిని తెలుగు దేశం పార్టీకి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి సభ నిర్వహణ కోసం ప్యానెల్ స్పీకర్స్ ను నియమించే అవకాశాలున్నాయి.
Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook