కేరళలో ఓ వధువు.. పెళ్లిమండపంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పెళ్లిలోనే డాన్స్ చేసి.. అతిధులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. సంప్రదాయ దుస్తుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన నవ వధువు.. ఇంకా పెళ్లి మంటపానికి చేరుకోకుండానే డాన్స్ మొదలు పెట్టింది. ఆమె వెనుక ఉన్న తోటి అమ్మాయిలు కూడా అందరూ నృత్యం చేయడం విశేషం.
ఈ పెళ్లి కేరళలోని కన్నూరులో జరిగినట్లు తెలుస్తోంది. కాబోయే భర్తను ఆశ్చర్యానికి గురి చేసే క్రమంలో అంజలి అనే వధువు.. ఇలా పెళ్లి మంటపంలో డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె డాన్స్ చూసిన అతిథులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతే కాదు కళ్యాణ మండపం అంతా అతిథుల నవ్వులు విరిశాయి. వారు కూడా చప్పట్లతో వధువు, అమ్మాయిల నృత్యానికి వంత పాడారు.
Be prepared folks. This is Year 2020. Brides will no more be shy or coy on their big days. See how a bride makes her entrance for her wedding in Cannor, Kerala.😝😆🥰👇🏿 pic.twitter.com/y9ZZjnYEpu
— Karan Kapoor (@karannkapoor18) January 28, 2020
Read Also: కరోనా వైరస్ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ
ఈ వధువు డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్ బుక్ లో పోస్టు చేయగానే .. వేలాది మంది ఈ వీడియోను లైక్ కొట్టడం విశేషం. ట్వట్టర్ లో 50 వేలకు పైగా ఈ వీడియో రీట్వీట్ అయ్యింది. మొత్తానికి పెళ్లి కూతురు .. పెళ్లి కొడుకును ఆశ్చర్యానికి గురి చేయాలనుకుంది.. కానీ ఈ విధంగా వీడియో వైరల్ అవుతుందని ఆమె కూడా ఊహించి ఉండదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..