Man Kills Wife After Fight Over Chicken: భర్త తనను సినిమాకు తీసుకెళ్లలేదని.. భార్య తనకు టీ ఇవ్వలేదని.. ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. తాజాగా ఇలాంటిదే మరో ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.భార్య చికెన్ వండలేదనే కోపంతో ఏకంగా ఆమెను కొడవలితో నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలుకా మాగనహళ్లికి చెందిన కెంచప్పకు షీలా (28) అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కెంచప్పకు షీలా రెండో భార్య. మొదటి భార్యతో విడిపోయాక రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కెంచప్ప-షీలా దంపతులకు ఒక కుమార్తె ఉంది. మద్యానికి బానిసైన కెంచప్ప తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు.
భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో షీలా ఇటీవల పుట్టింటికి వెళ్లింది. బుధవారం (జూన్ 8) కూతురి పుట్టినరోజు కావడంతో పుట్టింటి నుంచి వచ్చేసింది. బర్త్ డే స్పెషల్‌గా చికెన్ కర్రీ వండాలని కెంచప్ప భార్యతో చెప్పాడు. కానీ షీలా పట్టించుకోలేదు. బయటకు వెళ్లి మద్యం సేవించి వచ్చిన కెంచప్ప... చికెన్ కర్రీ ఎందుకు వండలేదని భార్య షీలాతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కొడవలితో ఆమెపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో షీలా మృతి చెందింది. ఆ మరుసటి రోజు కెంచప్ప నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కెంచప్పపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
గతేడాది ఆగస్టులో బెంగళూరులోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. భార్య చికెన్ ఫ్రై చేయడానికి నిరాకరించిందనే కోపంతో ముబారక్ పాషా అనే వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. హత్యానంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ చెరువులో పడేశాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం ఒప్పుకోక తప్పలేదు.
Also Read: KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?
Also Read: Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... ఈసారి ఎంత తగ్గిందంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook