Terror Attack: దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

దేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం.

Last Updated : Aug 26, 2020, 06:03 PM IST
Terror Attack: దేశంలో ఉగ్రదాడులకు కుట్ర

దేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ( Terror attacks ) కుట్రపన్నినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం.

భారతదేశ నిఘా వర్గాలకు అందిన సమాచారం అందర్నీ ఉలిక్కిపడేలా చేస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగవచ్చనేదే ఈ సమాచారం. జైష్ ఎ మొహమ్మద్ సంస్థ ( jaish e mohammad ), పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ( ISI ) కలిసి పెద్ద ఎత్తున విధ్వసం రచించారని నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir ) సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని దాడులకు టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆగస్టు 20న పాకిస్తాన్ లోని రావల్పిండిలో ఐఎస్ఐ అధికార్లతో జైష్ ఎ మొహమ్మద్ కు చెందిన మౌలానా అబ్దుల్ రవూఫ్ అజ్హర్, షకీల్ అహ్మద్ లు సమావేశమైనట్టు నిఘా వర్గాల అధికారులు నిర్ధారించారు. ఇస్లామాబాద్ లోని మర్కజ్ లో ఉగ్రదాడికి ప్రణాళిక జరిగినట్టు తెలుస్తోంది. 

బాలాకోట్ దాడుల ( Balakot attacks ) అనంతరం రెండు అంశాలపై జైష్ ఎ మొహమ్మద్ కు చెందిన మౌలానా అమ్మార్..పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు చేస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. పుల్వామా దాడికి ముందు కూడా ఇటువంటిదే ఓ సమావేశం జరిగినట్టు సమాచారం. Also read: Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ

Trending News