PSLV C58: ఇస్రో చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వి సి 58 ద్వారా అంతరిక్షంలో విజయవంతంగా ఎక్స్ పో శాట్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రవేశపెట్టింది. ఎక్స్ రే కిరణాలను అధ్యయనం చేసే ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్లు.
ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సి 58 వాహన నౌక ద్వారా ఇస్రో 480 కిలోల బరువున్న ఎక్స్ పో శాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇవాళ ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, 9.10 గంటలకు అంతరిక్షంలో దూసుకెళ్లింది. మరో 21 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిందని ఇస్రో స్వయంగా వెల్లడించింది. భారత అంతరిక్ష పరిశోధనా చరిత్రలో ఇది తొలి పోలారి మీటర్ మిషన్ కావడం విశేషం.
#WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh.
(Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ
— ANI (@ANI) January 1, 2024
ఎక్స్ పో శాట్ ఉపగ్రహంతో ఎక్స్ రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన జరగనుంది. దాంతోపాటు అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పర్సర్ విండ్, నెబ్యులా వంటి వాటి నుంచి వెలువడే ఎక్స్ రే కిరణాలను అధ్యయనం చేయనుంది. రాకెట్ నాలుగో దశలో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ కాలేజ్ విద్యార్ధినులు తయారు చేసిన విమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ , ఇతర ఉపకరణాలుంటాయి. ఇస్రో ప్రయోగించిన ఈ ఎక్స్పో శాట్ ఉపగ్రహంలో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్స్ ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో ఉన్న భూకక్ష్య నుంచి అధ్యయనం చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook