లోక్ సభ ఆమోదం పొందిన త్రిపుల్ తలాక్ బిల్లు ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై వాడీ వేడిగా చర్చ జరుగుతోంది. ఎన్టీయే పక్షాలు దీన్ని అనకూలంగా ఉండగా ..యూపీఏ పక్షాలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లు విషయంలో తటస్థంగా ఉన్నాయి. లోక్ సభలో సులభంగా త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదింపజేసుకున్న మోడీ సర్కార్... తమకు మెజార్టీ లేని రాజ్యసభలో ఈ బిల్లును ఏ రకంగా గట్టెక్కిస్తుందని ఉత్కంఠగా మారింది.
గట్టెక్కడం సాధ్యమేనా ?
త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి పెద్దల సభలో 121 సభ్యుల మద్దతు అవసరం ..ఎన్టీయే బలం 111 మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఎన్టీయే కు అనుకూలంగా వ్యవరిస్తున్న జేడీయూ, అన్నాడీఎంకే బిల్లుపై స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఒటింగ్ సమయానికి వాకౌట్ చేసే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటి వరకు మోడీ సర్కార్ చేసిన ప్రయత్నాలతో ప్రస్తుతానికి ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 113 మంది ఉండగా... వ్యతిరేకంగా 118 ఉన్నట్టుగా సమాచారం. 9 మంది సభ్యులు ఈ బిల్లు విషయంలో తటస్థంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెజార్టీ లేకుండా బిల్లును గట్టేక్కించడం సాధ్యమయ్యే పనేనా..అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది.
పెద్దలు అంగీకరించేనా ?
మరోవైపు రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీ లేకపోయినా సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును తరహా త్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో గట్టెక్కించవచ్చనే మోడీ సర్కార్ నమ్ముతోంది. ఇప్పటికీ ఈ బిల్లును వ్యతిరేకించాలా లేక సమర్థించాలా అనే అంశంపై పలు పార్టీలు నిర్ణయం తీసుకోకపోవడం కూడా అధికార పార్టీకి కలిసొచ్చే అంశమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి చర్చ సమయంలో బిల్లును వ్యతిరేకించినా... ఓటింగ్ సమయంలో పలు రాజకీయ పార్టీలు గైర్హాజరవుతాయని..తద్వారా బిల్లు ఆమోదం లభిస్తోందనే ధీమాతో అధికార పక్షం ఉంది. మొత్తానికి ట్రిపుల్ తలాక్ బిల్లుకు చట్టం రూపం తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం ప్రయత్నాలు ఈసారైనా ఫలిస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మిత్రపక్షాలు, జేడీయూ
ఇదిలా ఉండగా రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ తోప పాటు దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే త్రిపుల్ తలాఖ్‌ను సుప్రీంకోర్టు నిషేదించిందని గుర్తు చేస్తూ ..అలాంటి సమయంలో ఈ అంశంపై ప్రత్యేక బిల్లు ఎందుకని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తుస్తోంది. ఇదిలా ఉండగా ఎన్టీయే మిత్రపక్షంగా ఉన్న జేడీయూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. మహిళా సమానత్వాకి తాము కట్టుబడి ఉన్నపప్పటికీ రాజకీయ లక్ష్యంతో బిల్లును రూపొందించకూడదని..అందుకే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు సభలో జేడీయూ ఎంపీ పేర్కొన్నారు. అనంతరం జేడీయూ సభ్యులు సభ నుంచి వాకౌట్ అయ్యారు.
కేంద్ర మంత్రి రవిశంకర్ వివరణ
త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యభలో ఈ బిల్లును పెట్టిన కేంద్ర మంత్రి రవిశంకర్ ... ఈ బిల్లు గురించి మాట్లాడుతూ మహిళలను సమానత్వం కల్పించేందుకు తమ ప్రభుత్వ ఎజెండా అని ... పేద మస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. ఇప్పటి ప్రపంచ వ్యాప్తంగా 25 ముస్లిం దేశాలు త్రిపుల్ తలాక్ ను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేస్తూ మస్లిం సమాజానికి మేలు చేకూర్చే ఈ బిల్లును సభ్యులు మద్దుతు తెలపాలని కేంద్ర మంత్రి రవిశంకర్ కోరారు.