Indian Railways Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు

Indian Railways Jobs: నిరుద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి గుడ్‌న్యూస్, ఇండియన్ రైల్వేస్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. దీనికి సంబంధించిన నోటఫికేషన్ వెలువడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2024, 09:07 AM IST
Indian Railways Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు

Indian Railways Jobs: భారతీయ రైల్వే పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఇండియన్ రైల్వేస్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ఏకంగా 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఎలా అప్లై చేయాలి, అర్హతలేంటనే వివరాలు తెలుసుకుందాం.

భారతీయ రైల్వేలో ఉద్యోగాలంటే చాలామందికి ఆసక్తి ఎక్కువ. జీతాలు, సౌకర్యాలు ఎక్కువగా ఉండటం అందుకు కారణం. అందుకే రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల్ని ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు. దేశంలో మొత్తం 5,696 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. 
https://www.rrcb.gov.in అధికారిక వెబ్‌సైట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలుంటాయి. 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏఎల్‌పి నోటిఫికేషన్ 2024 వెలువరించింది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు భర్తీ కానున్నాయి. జనవరి 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఫిబ్రవరి 19 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఉంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు 250 రూపాయలు ఫీజు కాగా, ఇతరులకు అంటే ఓసీ కేటగరీకు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు కావల్సిన కనీస విద్యార్హత ఐటీఐ పూర్తి చేసుండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమో లేదా ఇంజనీరింగ్ పూర్తి చేసుండాలి. ఈ ఉద్యోగాలకు కావల్సిన వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మద్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భర్తీ నియమాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది. How to apply for assistant loco pilot posts in railways click here

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు జీతం కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. ప్రారంభవేతనం 19,900 రూపాయలు కాగా గరిష్టంగా 63, 200 రూపాయలుంది. దక్షిణాదిన సికింద్రాబాద్, తిరువనంతపురం, బెంగళూరు, చెన్నైలో ఖాళీలున్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలైన అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, గోరఖ్‌పూర్, జమ్ము శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్ పూర్, పాట్నా, రాంచీ, సిలిగురిలో ఖాళీలున్నాయి.

Also read: First Income tax: దేశంలో తొలిసారి ఇన్‌కంటాక్స్ ఎప్పుడు, ఎవరు విధించారు, ఎలా ప్రారంభమైంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News