IBPS Clerk Mains Result 2020: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2020 వచ్చేశాయి, డైరెక్ట్ లింక్ మీకోసం

IBPS Clerk Mains Result 2020: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ బ్యాంకింగ్స్ పర్సనల్ సెలెక్షన్(IBPS) సీఆర్‌పీ క్లర్క్ X ఫలితాలు విడుదల చేసింది. తమ ఫలితాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 1, 2021, 01:50 PM IST
IBPS Clerk Mains Result 2020: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2020 వచ్చేశాయి, డైరెక్ట్ లింక్ మీకోసం

IBPS Clerk Mains Result 2020: ఐబీపీఎస్ బ్యాంక్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన వారికి శుభవార్త వచ్చేసింది. ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ బ్యాంకింగ్స్ పర్సనల్ సెలెక్షన్(IBPS) సీఆర్‌పీ క్లర్క్ X ఫలితాలు విడుదల చేసింది. గురువారం విడుదల చేసిన ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

క్లర్క్ మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. లేదా ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫైనల్ ఫలితాలు 2020-21(IBPS Clerk Mains Result) చెక్ చేసుకునే విధానం ఇక్కడ అందిస్తున్నాం. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌తో దరఖాస్తులు మొదలుకుని ప్రతి క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ లాంటి అన్ని రకాల పోస్టుల ఫలితాలు ఎప్పటికప్పుడూ విడుదల చేసి నియామకాలు చేపడుతుంది.

Also Read: SBI Alert: ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్, నేడు ఈ సేవలకు అంతరాయం
 
స్టెప్ 1: ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS Official Website కు వెళ్లాలి

స్టెప్ 2: అందులో ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఫర్ సీఆర్‌పీ క్లర్క్ X (IBPS CRP Clerk X) మీద క్లిక్ చేయాలి  

స్టెప్ 3: ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కొంత విండో ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ వివరాలు అడుగుతుంది

స్టెప్ 4: అభ్యర్థి తమ రిజిస్ట్రేషన్ నెంబర్ / రోల్ నెంబర్ మరియు పాస్‌వర్డ్ / పుట్టినతేదీ (తేదీ- నెల- సంవత్సరం)తో పాటు క్యాప్చా వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి

స్టెప్ 5: మీ CRP-CLERK-X Result మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ ఫలితాలను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి

Also Read: Gold Price Today 01 April 2021: గుడ్ న్యూస్, మళ్లీ పతనమైన బంగారం ధరలు, వెండి ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News