Russian vaccine: ఇండియన్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ తో భారీ ఒప్పందం

కరోనా వ్యాక్సిన్  కోసం మరో భారతీయ కంపెనీ సిద్ధమౌతోంది. దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

Last Updated : Sep 16, 2020, 08:10 PM IST
  • స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో డాక్టర్ రెడ్డీస్ భారీ ఒప్పందం
  • పదికోట్ల డోసుల ఉత్పత్తి, మూడో దశ ట్రయల్స్ కు డీల్
  • విదేశీ కరోనా వ్యాక్సిన్తో ఒప్పందమైన రెండో భారతీయ కంపెనీగా డాక్టర్ రెడ్డీస్
Russian vaccine: ఇండియన్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ తో భారీ ఒప్పందం

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine)  కోసం మరో భారతీయ కంపెనీ సిద్ధమౌతోంది. దేశీయ ఫార్మా దిగ్గజమైన డాక్టర్ రెడ్డీస్ ..రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ( Oxford-AstraZeneca vaccine ) ఉత్పత్తి, పంపిణీ  ఒప్పందాన్ని కుదుర్చుుకున్న దేశీయ వ్యాక్సిన్ దిగ్గజ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) సరసనే మరో కంపెనీ చేరుతోంది. భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ( Dr Reddys ) ఇందులో భాగమైంది. ప్రపంచపు తొలి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ( Russai vaccine sputnik v ) తో డాక్టర్ రెడ్డీస్ భారీ డీల్ చేసుకుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ చేయడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్  ఫండ్ ( ఆర్‌డీఎఫ్ ) తో  ఈ ఒప్పందమైంది. దీని ప్రకారం  పదికోట్ల (100 మిలియన్ల ) డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ ( Covid 19 vaccine ) ను డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేయనుంది. 

ఇప్పుడు జరుగుతున్న మూడోదశ ట్రయల్స్ ( Third phase trials ) విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ( Russian Direct investment fund )‌ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రధానంగా అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించియయ ఎటువంటి దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితమైన పద్ధతిగా ఈ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్ ఫాం ఉందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీీఈఓ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరో నాలుగు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామన్నారు. 

అదే విధంగా ఒకటి,  రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో  మూడవ దశ ట్రయల్స్  నిర్వహించనున్నామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యా వ్యాక్సిన్ పై భారత్ సహా పలు దేశాలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  స్పుత్నిక్ వి  మూడోదశ పరీక్షలక భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ తో ఒప్పందమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రపంచమంతటికీ ఉత్పత్తి చేసి పంపిణీ చేసే సామర్ధ్యం ఒక్క భారత్ కే ఉందని ఇప్పటికే ప్రముఖ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ  క్రమంలో వివిధ దేశాల్లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ల పంపిణీ ఇండియన్ కంపెనీలకు దక్కుతుండటం నిజంగానే గర్వకారణం. Also read: AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

Trending News