India Corona Vaccination: వందకోట్ల మైలురాయికి చేరువలో ఇండియా కోవిడ్ వ్యాక్సినేషన్

India Corona Vaccination: కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇటు ఇండియాలో సైతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. మరి కొద్దిరోజుల్లోనే ఇండియా వ్యాక్సినేషన్ వందకోట్ల మార్క్ దాటనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 06:57 AM IST
  • త్వరలో వందకోట్ల కరోనా వ్యాక్సినేషన్ మార్క్ దాటనున్న ఇండియా
  • దేశంలో 97.23 కోట్లకు చేరుకున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం
  • దేశంలో ఇప్పటి వరకూ 59 కోట్లమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు
India Corona Vaccination: వందకోట్ల మైలురాయికి చేరువలో ఇండియా కోవిడ్ వ్యాక్సినేషన్

India Corona Vaccination: కరోనా మహమ్మారి నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇటు ఇండియాలో సైతం కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. మరి కొద్దిరోజుల్లోనే ఇండియా వ్యాక్సినేషన్ వందకోట్ల మార్క్ దాటనుంది.

దేశంలో కరోనా సంక్రమణను అరికట్టేందుకు ఉన్న ఏకైక మార్గం కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)ప్రక్రియను వేగవంతం చేయడం. గత కొద్దిరోజుల్నించి దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఊపందుకుంది. ప్రతిరోజూ భారీగా వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. ఒక్కోసారి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8 లక్షల 36 వేల 118 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో ఇప్పటి వరకూ 97.23 కోట్లడోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. మరి కొద్దిరోజుల్లోనే ఇండియా వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్(Hundred Crores Vaccination Mark)దాటనుంది.

మరోవైపు దేశంలో కొద్దిరోజుల్నించి కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 17 వేల 861 మంది కోలుకున్నారు. అటు కొత్త కేసులు 15 వేల 981 నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 33 లక్షల 99 వేల 961 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు(Corona Recovery Rate) ప్రస్తుతం 98,08 శాతానికి చేరుకుంది. గత 24 వారం రోజుల్నించి దేశంలో 20 వేలకంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 2 లక్షల 1 వేయి 632 కరోనా యాక్టివ్ కేసులున్నాయి, దేశంలో 218 రోజుల కనిష్టమిది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకూ 59 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించగా గత 24 గంటల్లో 9 లక్షల 23 వేలమందికి పరీక్షలు చేశారు. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉంది. గత 113 రోజుల్నించి 3 శాతం కంటే తక్కువే నమోదవుతోంది. 

Also read: Sharad Pawar: అమిత్ షాతో భేటీ కానున్న శరద్ పవార్, కారణం అదేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News