Chandrayaan-3 Launches Today: 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ చంద్రయాన్-3 (Chandrayaan-3) ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈరోజు మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. చంద్రయాన్-3 ఆగష్టు 23న జాబిల్లిని తాకే అవకాశం ఉంది. ఒకవేళ ఇది దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కుతోంది. అంతేకాకుండా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా మన దేశం గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు అమెరికా (USA), రష్యా (Russia), చైనా (China) దేశాలు చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహక నౌకలను ల్యాండ్ చేయగలిగాయి. చంద్రుడి (Moon Mission)పై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఈ సారి ఇస్రో అన్ని చర్యలు తీసుకుంది.
అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3ని ప్రయోగించనున్నారు. దీని బరువు 3900 కిలోలు ఉండనుంది. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,148 కిలోలు, ల్యాండర్ మరియు రోవర్ 1,752 కిలోలు బరువు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టు చేపట్టడానికి రూ. 613 కోట్లు ఖర్చు అయింది. ఈ ప్రయోగం ద్వారా మన శాస్త్రవేత్తలు జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగయ్యే సామర్థ్యం, రోవర్‌ను నడపగలిగే సత్తా భారత్‌కు ఉన్నాయని చాటి చెప్పనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా 2019 జూలైలో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. దీంతో వైఫల్యాలనే విజయ సోపానాలుగా మార్చుకొని సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ అయింది. అంతకుముందు.. 2008లో చంద్రయాన్-1 (ల్యాండర్ లేకుండా ఆర్బిటర్, ఇంపాక్టర్‌తో జరిపిన ప్రయత్నం)ను చేపట్టి సక్సెస్ అయింది ఇస్రో.
Also Read: Delhi Floods Scary Pics: జలదిగ్భంధనంలో దేశ రాజదాని, భయం గొలుపుతున్న వరద దృశ్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook