పాన్‌కార్డు-ఆధార్ అనుసంధాన గడువును జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)ప్రకటించింది. ఇంతకు ముందు మార్చి 31 చివరి తేదీగా ఉండగా.. సుప్రీంకోర్టు సూచనతో పొడగింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.
ఆదాయపు పన్ను రాబడి (ఐటీఆర్-ఇన్‌కం టాక్స్ రిటర్న్స్) దాఖలుకు ఆధార్ తప్పనిసరి అని ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే..! ఆదాయపు పన్ను చట్టం యొక్క సెక్షన్ 139 AA (2) ప్రకారం, జూలై 1, 2017 నాటికి పాన్ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్‌ను పొందటానికి అర్హులు. తన ఆధార్ నంబర్‌ను పన్ను అధికారులకు తెలియజేయాలి.
మార్చి 5వ తేదీ వరకు అప్డేటెడ్ డేటా ప్రకారం, దేశం మొత్తం 33 కోట్ల మందికి పాన్ కార్డులు ఉండగా.. మార్చి 5 నాటికి 16.65 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో లింక్ అయ్యాయని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ రెండు డేటాబేస్లకు జూలై 31, ఆగస్టు 31, డిసెంబరు 31, 2017 తేదీలను కలుపుతూ గడచిన తేదీలను ఈ ఏడాది మార్చి 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే.!
ఆధార్ - పాన్‌పై కేంద్రం కీలక ప్రకటన