Viral News: రూ.50 వేలు ఇస్తేనే కొడుకు శవం.. లంచం డబ్బుల కోసం వీధుల్లో ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన

Couple Begs as Govt Hospital Staff Demands Bribe:  బీహార్‌లో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కొడుకు శవాన్ని అప్పగించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో.. లంచం డబ్బుల కోసం ఓ పేద తల్లిదండ్రులు భిక్షాటన చేస్తూ వీధుల్లో తిరుగుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 08:58 AM IST
  • బీహార్‌లో హృదయవిదారక ఘటన
  • కొడుకు శవాన్ని అప్పగించేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది
  • లంచం డబ్బుల కోసం వీధుల్లో బిచ్చమెత్తుతున్న తల్లిదండ్రులు
Viral News: రూ.50 వేలు ఇస్తేనే కొడుకు శవం.. లంచం డబ్బుల కోసం వీధుల్లో ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన

Couple Begs as Govt Hospital Staff Demands Bribe: కొన్నాళ్ల క్రితం ఆ పేద దంపతుల కొడుకు తప్పిపోయాడు. ఇటీవల ఉన్నట్టుండి ఒకరోజు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. మీ కొడుకు శవం మార్చురీలో ఉంది.. వచ్చి తీసుకెళ్లండని చెప్పారు. అసలే కొడుకు తప్పిపోయాడనే బాధ..  ఇప్పుడతన్ని శవంగా చూడాల్సి రావడం ఆ తల్లిదండ్రులను తీవ్ర దు:ఖంలో ముంచెత్తింది.  చనిపోయిన కొడుక్కి అంతిమ సంస్కారాలైనా నిర్వహిద్దామనుకుంటే.. శవాన్ని అప్పగించేందుకు మార్చురీ సిబ్బంది లంచం అడిగాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు లంచం డబ్బుల కోసం వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.

వయసు మీద పడ్డ ఆ తల్లిదండ్రులు బీహార్‌లోని సమస్తీపూర్ వీధుల్లో భిక్షాటన చేస్తున్న వీడియో ఇటీవల వెలుగుచూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా దృష్టికి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు ఆ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీయగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ సిబ్బందికి లంచం ఇచ్చేందుకు భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. 

'కొన్నాళ్ల క్రితం మా కొడుకు తప్పిపోయాడు. సమస్తీపూర్‌లోని సదర్ ఆసుపత్రిలో అతని శవం ఉన్నట్లు ఇటీవల మాకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది రూ.50 వేలు లంచం అడిగారు. లంచం ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేము పేదవాళ్లం.అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం. అందుకే ఇలా వీధుల్లో భిక్షాటన చేస్తున్నాం.' అని ఆ తండ్రి వాపోయాడు.

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. లంచం అడిగిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమస్తీపూర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఇది మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటన అని.. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు.

కాగా, సదర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారేనని... వారికి నెలా నెలా సరిగా వేతనాలు ఇవ్వట్లేదని అక్కడి వారు చెబుతున్నారు. వేతనాలు అందకపోవడంతో ఇలా ఆసుపత్రికి వచ్చే వారి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ పేద తల్లిదండ్రుల  భిక్షాటన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

Also Read: Monkeypox: పురుషులకు పురుషులకు మధ్య శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ..

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. జనసేనాని దారెటు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News