కోడిపెట్టలకు టికెట్టు కొట్టిన కండక్టర్

బెంగళూరు దగ్గరలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన రెండు కోడిపెట్టలతో గౌరిబిదనూర్ నుండి పెద్దనహళ్లికి కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

Last Updated : Jul 2, 2018, 03:55 PM IST
కోడిపెట్టలకు టికెట్టు కొట్టిన కండక్టర్

కర్ణాటక: బెంగళూరు దగ్గరలోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన రెండు కోడిపెట్టలతో గౌరిబిదనూర్ నుండి పెద్దనహళ్లికి కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎక్కాడు. టికెట్ కోసం రూ.50 నోటుని బస్ కండక్టర్‌కు ఇస్తే.. బస్సు కండక్టర్ అతనికి ఒక ఫుల్ టికెట్(రూ.24) రెండు కోడిపెట్టలకు రెండు హాఫ్ టికెట్లు తీసి సదరు వ్యక్తి చేతిలో రెండు రూపాయలు పెట్టేశాడు. ఆ టికెట్లపై కోడిపెట్టలకు అని రాసి ఇచ్చాడు. ఖంగుతిన్న రైతు ఇదేంటని ప్రశ్నించగా.. ఆర్టీసీ రూల్స్ ప్రకారం అంతే అని కండక్టర్ అన్నాడు.

కర్ణాటక ఆర్టీసీ రూల్స్ ప్రకారం కోళ్ళు, కుందేళ్ళు, పిల్లులు, కుక్క పిల్లలు, పక్షులకు లగేజీతో సమానంగా హాఫ్ టికెట్ తీయాల్సిందే అని కండక్టర్ సమాధానమిచ్చాడు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను అడగగా.. కర్ణాటక ఆర్టీసీ రూల్స్ ప్రకారం హాఫ్ టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని.. కండక్టర్ రూల్స్ ప్రకారమే టికెట్ కొట్టాడని స్పష్టం చేశారు.  ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Trending News