Bank Holidays November 2021: నవంబర్ నెలలో బ్యాంకుకు వెళ్లేముందు బంద్ ఉండే రోజుల గురించి తెలుసుకోవటం మంచిది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (The Reserve Bank of India) విడుదల చేసిన బ్యాంకు సెలవు రోజుల ప్రకారం, సాధారణ సెలవులు, పండుగలు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
నవంబర్ నెలలో చాలా బ్యాంకు లావాదేవీల పనులు పెట్టుకున్నారా..?? ఈ సెలవు రోజులను చూసి భయపడకండి. బ్యాంకు సెలవు రోజులు రాష్ట్రాలను బట్టి మారాతాయి. ఉదాహరణకు కర్ణాటక రాజ్యోత్సవం, ఛత్ పూజా వంటి పండుగలను జరుపుకునే ఆయా రాష్ట్రాలలో మాత్రమే ఆ రోజు బ్యాంకులకు సెలవు.. ఆ రోజుల్లో ఇతర రాష్ట్రాలలో బ్యాంకులు పని చేస్తాయి.
Also Read: NEET PG Counselling: నిలిచిపోయిన నీట్ పీజీ కౌన్సిలింగ్, సుప్రీంకోర్టులో విచారణ
అలాగే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... దీపావళి, కార్తీక పౌర్ణమి రెండు రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు.. వీటితో పాటుగా శని ఆదివారాలలో సెలవులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏకంగా 17 రోజులు సెలవు అంటూ ప్రచారం జరుగుతుంది. కావున ఈ పుకార్లను నమ్మకుండా కింద పేర్కొన్న సెలవు రోజులను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు పనులను షెడ్యూల్ చేసుకోండి.
ఏపీ, తెలంగాణలో బ్యాంకు సెలవులు
* నవంబర్ 4 - గురువారం (దీపావళి)
* నవంబర్ 7 - ఆదివారం
* నవంబర్ 13 - రెండో శనివారం
Also Read: Income Tax Notices: రిక్షా కార్మికుడికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులు
* నవంబర్ 14 - ఆదివారం
* నవంబర్ 19 - శుక్రవారం (కార్తీక పొర్ణమి/ గురునానక్ జయంతి)
* నవంబర్ 21 - ఆదివారం
* నవంబర్ 27 - నాలుగో శనివారం
* నవంబర్ 28 - ఆదివారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook