White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!

White Hair Solution: మీ శరీరానికి తగినంత పోషకాలు లభించనప్పుడు తక్కువ వయసులోనే జుట్టు తెల్లగా మారేందుకు అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారాన్ని రోజూ తీసుకోవడం వల్ల తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 01:47 PM IST
White Hair Solution: తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి!

White Hair Solution: మనలో చాలామంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలా చాలా మంది చిన్న వయసులో తెల్ల జుట్టు సమస్య ఏర్పడుతుంది. ఈరోజుల్లోని యువతలో ఎక్కువ శాతం తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్, రక్తహీనత, జుట్టులో పోషకాల లోపం వంటి వ్యాధుల వల్ల ఇలాంటి సమస్యలు రావొచ్చు. అయితే మనం తినే ఆహారంలో విటమిన్ - డి, బి 12 సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల జుట్టుకు పోషకాలు అందించవచ్చు. అలాంటి డైట్ ను రోజూ ఫాలో అవ్వడం వల్ల తెల్ల జుట్టు సమస్యను నివారించుకోవచ్చు. 

ఆహారంలో గుడ్లు చేర్చుకోండి

ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టును మెరుగుపరచడం సహా తెల్ల జుట్టు సమస్యను నివారించుకునేందుకు ఆహారంలో తప్పనిసరిగా ఉడికించిన గుడ్లును తినడం తప్పనిసరి చేసుకోవాలి.

పెరుగుతో జుట్టుకు మేలు..

పెరుగులో విటమిన్ - బి12 పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు నల్లగా ఉంచడంలో మేలు చేస్తుంది. రోజూ తినే ఆహారంలో పెరుగు లేదా లస్సీ వంటి వాటిని తీసుకుంటే మేలు జరుగుతుంది. 

ఆహారంలో మెంతులు వేసుకుంటే..

మెంతులు జుట్టు నల్లగా మారడంలో సహాయపడతాయి. మెంతికూరలో ఐరన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టులో మెలనిన్ అనే మూలకాన్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మెలనిన్ అనే మూలకం లేకపోవడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుంది. అందుకే మెలనిన్‌ను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

ఆకుపచ్చని కూరగాయలతో..

రోజూ తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. విటమిన్ B-6, విటమిన్ B-12 ఇతర పోషకాలు ఆకుపచ్చ కూరగాయలలో కనిపిస్తాయి. ఇవి తినడం వల్ల జుట్టుకు అవసరమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   

Also Read: Chikoo Health Benefits: ఈ అనారోగ్య సమస్యలకు సపోటా పండు ఎంతో మేలు చేస్తుంది!

Also Read: World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News