Weight Loss Home Remedies: ప్రతి ఒక్కరూ తమ శరీరం స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని బరువు పెరగుతున్నారు. దీంతో శరీర లావుగా అందహీనంగా తయారవుతోంది. ఈ బరువును తగ్గించుకోవడానికి జిమ్‌ను, డైటీషీయన్లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంత మందైతే భారీ వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. అయితే శరీర బరువు తగ్గడానికి ఇక నుంచి వీటన్నిటినీ చేయనక్కర్లేదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంటి చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బరువు తగ్గే డైట్‌లో ఇవి తప్పని సరి:
తేనె, నిమ్మ:
తేనె, నిమ్మ రసం శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా నిమ్మలో ఉండే పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి వేడి నీటిలో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
జీలకర్ర నీరు:
జీలకర్ర నీరు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఔషధ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ జీలకర్రను నీటిలో నానబెట్టి తాగాల్సి ఉంటుంది.
పెరుగు రైతా:
పెరుగులో మంచి శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. కాబట్టి ఆహారాలు తీసుకున్న తర్వాత దహీ రైతా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రైతను ప్రతి రోజు తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
ఇంట్లో వ్యాయామాలు చేయడం:
ప్రస్తుతం బరువు తగ్గే క్రమంలో వ్యాయామాలు చేయడం మానుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Ind Vs Ban: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇద్దరు ప్లేయర్లు ఔట్
Also Read: Ap Rains: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook