Weight Loss Tips At Home: ఆధునిక జీవనశైలి కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. భారత్‌లో ఈ సమస్యతో ప్రతి పది మందిలో నలుగురు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం వల్ల చాలా మందికి మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని ఇటీవల నివేదికలు వెల్లడించాయి. కావున పెరుగుతున్న బరువు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
శరీర బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల చిట్కాలను ఉపయోగిస్తున్నారు. అందులో కొంతమంది డైట్, వ్యాయామాలు చేస్తుంటే.. మరికొంతమంది వైద్యులను సంప్రదించి ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే బరువుని తగ్గించుకోవడానికి చాలా సులభమైన మార్గాలున్నాయి. అందులో ముఖ్యమైన మార్గం డ్రై ఫ్రూట్స్ డైట్ గా నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ డ్రైఫ్రూట్స్ డైట్ వల్ల బాడీ ఫిట్ గా ఉండడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది ఫాలో అయినా చాలామంది సులభంగా బరువు తగ్గాలని ఇటీవల పనులు నివేదికలు తెలిపాయి. అయితే డ్రై ఫ్రూట్స్ డైట్ లో ఎలాంటి నియమాలు అనుసరించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట అల్పాహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పనిసరి:
ఒకవేళ అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఉదయం పూట తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా బరువు తగ్గే క్రమంలో చాలామంది పూరీలు, పరాటాలు ఉదయం పూట ఆహారంగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున బరువు తగ్గే క్రమంలో మంచి పోషకాలు ఉన్న ఆహారాలు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
ఉదయం పూట టిఫిన్లు ఇవి తప్పనిసరి:
పిస్తాపప్పులు:
పిస్తా పప్పులో శరీరంలో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది ఉంటుంది. అయితే ఉదయం పూట వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మంచి శక్తినిస్తుంది. అంతేకాకుండా శరీరం దృఢంగా తయారవుతుంది. చాలామందిలో ఇది ఆకలిని కూడా నియంత్రించిందని నివేదికలు తెలిపాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది.
ఖర్జూరాలు:
ఖర్జురాల్లో శరీరం కావాల్సిన అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇవి శరీర బరువును కూడా నియంత్రిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో వీటిని చేర్చుకోవాలి. ఖర్జురాల్లో శరీరానికి అవసరమైన బి5 విటమిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. బరువును సులభంగా నియంత్రిస్తుంది.
వాల్‌నట్స్:
వాల్ నట్స్ శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలను అందిస్తాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల.. ఊబకాయం, గుండె సమస్యలను సులభంగా నియంత్రిస్తుంది. అయితే ఎవరైనా మధుమేహం గుండె సమస్యలతో బాధ పడుతుంటే తప్పనిసరిగా అల్పాహారంలో వీటిని తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook