Weight Loss In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది బరువు పెరగడం, వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ఇతర అనారోగ్యకరమైన ఆహారం తీసుకవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువును తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పడికీ బరువును నియంత్రించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా మార్కెట్ వివిధ రకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అయినా బరువుతగ్గడం లేదు. అయితే ఇదే క్రమంలో చాలా మంది భారీ వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించడం వల్ల త్వరలోనే బరువు తగ్గుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి నియమాలు పాటించడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నిపుణులు సూచించిన సులభమైన చిట్కాలు ఇవే..
ఆహారాన్ని మెత్తగా నమలడం:
ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల కారణాల వల్ల తొందరపడి తింటూ ఉంటారు. అయితే జీర్ణక్రియ మెరుగుపడేందుకు ఆహారాన్ని నిదానంగా తినాలి. అంతేకాకుండా శరీరానికి చాలా రకాల పోషకాలను అందజేస్తుంది. ఇలా తినే క్రమంలో మెత్తగా నమలం వల్ల బరువు కూడా సులభంగా తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి.
చిన్న కంచంలో ఆహారాన్ని తీసుకోండి:
పెద్ద ప్లేట్‌లో ఆహారం తిసుకోవడం వల్ల అధిక పరిమాణంలో తినొచ్చు. కంచం పెద్ద పరిమాణంలో ఉండి చిన్న పరిమాణంలో ఆహారం కనిపిస్తుంది. కావున ఎక్కువ ఆహారాన్ని తీసుకునేందుకు వీలుంటుంది. అందుకే బరువును నియంత్రించుకునే వారు తప్పకుండా చిన్న ప్లేట్‌లోనే ఆహారాన్ని తీసుకోండి. అంతేకాకుండా ఆహారం తీసుకునే క్రమంలో శ్రద్ధవహించడం కూడా చాలా మేలు.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తినండి:
శరీర బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా.. ప్రతి సందర్భంలోనూ ప్రొటీన్ డైట్ ఎంతో అవసరం. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ప్రోటీన్‌లో ఉండే మూలకాలు ఆకలి తొలగిస్తుంది. అయితే ఇలాంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా పప్పు, బాదం, చేపలు, పాలు, పెరుగు వంటి ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఫైబర్ రిచ్ డైట్:
శరీర జీర్ణ క్రియకు ఫైబర్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని నియంత్రిస్తుందిని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కావున పండ్లు, కూరగాయలను అధిక పరిమాణంలో తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.