Honey Water For Weight Loss: ఈ వార్మ్‌ వాటర్‌తో 15 రోజుల్లో 2కిలో బరువు తగ్గడం ఖాయం!

Warm Honey Water For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఖాళీ కడుపుతో ఈ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 8, 2023, 08:57 AM IST
 Honey Water For Weight Loss: ఈ వార్మ్‌ వాటర్‌తో 15 రోజుల్లో 2కిలో బరువు తగ్గడం ఖాయం!

Warm Honey Water For Weight Loss: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో పాటు తేనె, నిమ్మరసం తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. ఇలా ప్రతి రోజు బరువు తగ్గాలనుకునేవారు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మలబద్ధకం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఉబ్బరం, చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే మూలకాలు హానికరమైన టాక్సిన్స్‌ను నియంత్రిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. ఒత్తిడి సమస్యలతో బాధపడేవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఈ నీటిని ఎలా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇలా గోరువెచ్చని నీటీతో అన్ని సమస్యలకు చెక్‌:
•ప్రతి రోజు గోరువెచ్చని నీటిలో నిమ్మ రసం, తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. 
• కాలేయాన్ని నిర్విషీకరణ చేసేందుకు కూడా ఈ గోరువెచ్చని నీరు సహాయపడుతుంది. 
• ఉబ్బరం, పొత్తికడుపు సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. 

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
1. ఖాళీ కడుపుతో కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాల్సి ఉంటుంది.
2. ఈ నీటిలో తేనెను కేవలం ఒక టేబుల్‌ స్పూన్‌ మాత్రమే మిక్స్‌ చేసుకోవాలి. 
3. కేవలం సగం నిమ్మకాయనే వినియోగించాలి. 
4. ఈ నీటిని అతిగా తాగడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. 
5. అంతేకాకుండా నోటి పూతల వంటి సమస్యలు కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
6. ఆర్థరైటిస్, హైపర్‌యాసిడిటీ, బలహీనమైన దంతాలు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ గోరు వెచ్చని నీటిని తాగకపోవడం చాలా మంచిది. 

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. డీఏ పెంపుపై క్లారిటీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News