Thyroid Control Juice: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మధుమేహం, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి నాలుగురిలో ఇద్దరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. థైరాయిడ్ అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరని నిపుణులు పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి కొన్నిజ్యూస్‌లు కూడా తాగొచ్చని వారు చెబుతున్నారు. వీటిని తాగడం వల్ల థైరాయిడ్ అదుపులో ఉండడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఏ జ్యూస్‌లు తాగితే థైరాయిడ్ అదుపులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
థైరాయిడ్ శరీర బరువు పెంచుతుంది:
శరీరంలో థైరాయిడ్ ఉంటే బరువు పెరగం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ బరువు పెరగడం సమస్యను ఆహారంలో మార్పుల వల్ల అదుపులోకి తెచ్చుకుంటున్నారు. దీని కోసం సొరకాయ రసం, గోరింటాకు రసం, పొట్లకాయ రసం, వంటి జ్యూస్‌లు తాగడం వల్ల థైరాయిడ్ నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు.
ఈ రసాలు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందా..?
వాటర్‌క్రెస్, హైసింత్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్‌ను అదుపులో ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. వీటిని తయారు చేసుకోవడానికి రెండు కప్పుల సువాసనగల ఆడేలు (వాటర్‌క్రెస్) తిసుకోవాలి. అందులో 1 టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి మిక్సీలో బాగా రుబ్బుకోవాలి. ఇలా తయారు చేసిన జ్యూస్‌ను రోజు ఉదయం తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే థైరాయిడ్ అదుపులో ఉండి బరువు కూడా తగ్గుతుంది.
బీట్‌రూట్, క్యారెట్ రసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది:
బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల థైరాయిడ్ అదుపులో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. దీన్ని తాగడం వల్ల శరీరంలో రక్తం పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Weight Loss Tips: ఈ చిట్కా వాడితే కొద్దిరోజుల్లోనే బరువు ఇట్టే తగ్గిపోతారు!
Also Read: Raisins: నానబెట్టిన ఎండు ద్రాక్ష వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook