Skin Care For Winter: భారత్‌లో వింటర్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో వాతావరణంలోని తేమ ఒక్కసారిగా పెరిగిపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీయోచ్చు. చాలా మందిలో ఈ చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా స్కిన్ అలర్జీ, ముఖంపై ఎరుపు, వాపు, పొడి చర్మం, దురద, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మాన్ని కప్పి ఉంచే దుస్తువులను ధరించాలి. దీంతో పాటు ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా పై చర్మ సమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఉన్ని దుస్తులను ధరించకూడదు:
ప్రస్తుతం చాలా మంది శరీరం వెచ్చధనం కోసం ఉన్ని దుస్తువులను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల చాలా మందిలో అలెర్జీ వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా శరీరంపై బ్యాక్టీరియా పెరుగుతోంది. దీని కారణంగా కొందరిలో చర్మం ఎర్రగా మారి మంట సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి శీతాకాలంలో తప్పకుండా ఉన్ని దుస్తువులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఉన్ని దుస్తువులను ధరించాలనుకుంటే క్రమం తప్పకుండా ఉతికి ధరించాల్సి ఉంటుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
కోల్డ్ క్రీం మాయిశ్చరైజర్స్‌ను తప్పకుండా వినియోగించాలి:
శీతాకాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మందిలో దురద, మంట సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉన్ని దుస్తువులు ధరిస్తారు. ఇలాంటి దుస్తువులను ధరించే క్రమంలో తప్పకుండా కోల్డ్ క్రీం మాయిశ్చరైజర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల అలెర్జీ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దురద, చర్మం ఎరుపు రంగులోకి మారడం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఆలివ్ ఆయిల్ అప్లై చేయండి:
చలి కాలంలో చర్మానికి తప్పకుండా ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పండ్లతో పాటు కూరగాయలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొడి చర్మం వంటి సమస్యలు ఉన్నవారు గ్లిజరన్‌తో పాటు రోజ్ వాటర్ మిక్స్‌ను అప్లై చేయాల్సి ఉంటుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook