Weight Loss Tips: ఈ పలుకులను తింటే.. పది రోజుల్లో బరువు తగ్గుతారు...!

Pistachio Nuts Benefits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవిగా అందరు భావిస్తారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు తరచుగా దీనిని తినమని సూచిస్తారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌లో పిస్తాపప్పు ఒకటి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర సమస్యలు తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 12:48 PM IST
  • పిస్తా పలుకుల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
  • బరువు తగ్గడానికి సహాయపడతాయి
  • ఎముకలు దృఢంగా మారుతాయి
Weight Loss Tips: ఈ పలుకులను తింటే.. పది రోజుల్లో బరువు తగ్గుతారు...!

Pistachio Nuts Benefits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవిగా అందరు భావిస్తారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు తరచుగా దీనిని తినమని సూచిస్తారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌లో పిస్తాపప్పు ఒకటి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర సమస్యలు తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే ఆక్సిడెంట్లు, సహజ కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, ఫైబర్ బాడీని దృఢంగా చేసేందుకు దోహదపడతాయని నిపుణులు పేర్కొన్నారు.  

పిస్తా తినడం వల్ల ఈ 5 రకాల ప్రయోజనాలు:

పిస్తాలు వంటకం రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. పిస్తా పలుకులను క్రమం తప్పకుండా తినడం వల్ల 5 రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ అంశంపై గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌కు చెందిన  ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్‌ వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. బరువు తగ్గడానికి సహాయపడతాయి:

పిస్తాపప్పు తినడం వల్ల శరీరానికి చాలా రకాల లభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. దీనితో శరీరానికి ఉత్తమమైన ప్రోటీన్స్‌ లభిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఇది కండరాలను బలపరిచి.. శరీర బరువును తగ్గించడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. ఎముకలు దృఢంగా మారుతాయి:

వృద్ధాప్యంతో ఎముకలు బలహీనపడటం అనివార్యం.. కానీ కొంతమందికి చిన్న వయస్సులోనే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో.. పిస్తాపప్పులను తప్పనిసరిగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.  ఇందులో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నందున.. ఇవి ఎముకలకు చాలా మేలు చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

3. డయాబెటిస్‌పై ప్రభావవం:

మధుమేహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు.. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో పిస్తాపప్పులు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుందని వారు తెలుపుతున్నారు.

4. జ్ఞాపకశక్తి:

మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మందిలో జ్ఞాపకశక్తి చాలా బలహీనంగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో పిస్తాపప్పును తినమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జ్ఞాపకశక్తి పెంచేందుకు కృషి చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

5. కంటి చూపు మెరుగుపడుతుంది:

పిస్తాలో జియాక్సంతిన్, లుటిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!

Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News