/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Gut Health Foods: పేగుల ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పేగులు మన శరీరానికి కావలసిన పోషకాలను గ్రహించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మనం తినే ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి.

పేగుల ఆరోగ్యం ఎందుకు ముఖ్యం:

జీర్ణ వ్యవస్థ: 

పేగులు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి, శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి. పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.

రోగ నిరోధక శక్తి: 

మన శరీరంలో 70% రోగ నిరోధక కణాలు పేగులలో ఉంటాయి. పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన శరీరం వ్యాధులను తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది.

మనోవేదం: 

పేగులు, మెదడు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. పేగుల ఆరోగ్యం మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

పోషకాల శోషణ: 

పేగులు ఆహారం నుండి విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను శోషించుకుంటాయి. పేగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన శరీరానికి కావలసిన పోషకాలు సరిగ్గా లభిస్తాయి. పేగుల ఆరోగ్యం మన శరీరంలోని అనేక అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, పేగుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

పేగులు మన శరీరంలోని ఒక ముఖ్యమైన భాగం. అవి మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో, శరీరానికి కావలసిన పోషకాలను గ్రహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పేగుల ఆరోగ్యం మన మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

పేగుల ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాలు:

1. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు:

పీచు పదార్థాలు మన ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి  పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కూరగాయలు: బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, బఠానీలు పేగుల కదలికలను మెరుగుపరుచుతాయి. 

పండ్లు: ఆపిల్, పేరు, బాణన, బెర్రీలు వంటి పండ్లను డైట్ లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 

గింజలు: చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పండ్లతో పాటు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరుచుతాయి. 

తృణధాన్యాలు: ఓట్స్, బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 

2. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాలు:

ప్రోబయోటిక్స్ అనేవి మన పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా. ఇవి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పెరుగు, కిమ్చి,  సావర్‌క్రాట్, మజ్జిగ వంటి వాటిలో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో మేలు చేస్తాయి. 

3. ప్రీబయోటిక్స్ ఉన్న ఆహారాలు:

ప్రీబయోటిక్స్ అనేవి మన పేగులలోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉంటాయి.

బనానా, అల్లం, ఆలివ్ ఆయిల్, పుల్లని ఉల్లి వీటిలో కూడా పేగులకు ఎంతో సహాయపడుతుంది. ఆహారానికి  మృదువు చేయడంలో ఎంతో సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Improve Gut Health Using These Food Items In Your Diet Sd
News Source: 
Home Title: 

Gut Health: పేగులు బాగుండాలంటే.. తప్పకుండా ఈ ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది!!

Gut Health: పేగులు బాగుండాలంటే.. తప్పకుండా ఈ ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది!!
Caption: 
Zee Telugu News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
పేగులు బాగుండాలంటే.. తప్పకుండా ఈ ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది!!
Shashi Maheshwarapu
Publish Later: 
No
Publish At: 
Saturday, August 10, 2024 - 11:39
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
324