Best Weight Loss Tips: ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతున్నారా? ఈ హాక్స్‌తో సులభంగా తగ్గొచ్చు..

Best Weight Loss Tips: ప్రస్తుతం చాలామంది శరీర బరువును నియంత్రించుకోవడానికి అతిగా కాఫీలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోవడం వల్ల శరీర బరువు రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 05:37 PM IST
Best Weight Loss Tips: ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతున్నారా? ఈ హాక్స్‌తో సులభంగా తగ్గొచ్చు..

Best Weight Loss Tips: శరీర బరువు తగ్గడానికి వివిధ రకాల డైట్లను అనుసరించడమే..కాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బరువు తగ్గడానికి కొన్ని టిప్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని వినియోగించి సులభంగా బరువు బరువు తగ్గొచ్చట. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకునే కాఫీ నిమ్మరసం డైట్‌లో భాగంగా వినియోగించి కూడా బరువు తగ్గొచ్చు. అయితే ఈ హ్యాక్స్‌ని ఎలా వినియోగించాలో.. దీనిని అనుసరించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి ఏం చేయాలి:
ముందుగా బరువు తగ్గడానికి జీర్ణ క్రియను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతిరోజు నిమ్మరసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సులభంగా బరువు తగ్గాలనుకునే వారు ఉదయం ఖాళీ కడుపుతో తప్పకుండా నిమ్మరసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

ఈ తప్పు అసలు చేయకండి:
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు కాఫీ తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల మీ శరీర బరువు కూడా రెండింతలు పెరుగుతుందట..కాబట్టి బరువు తగ్గే క్రమంలో కాఫీని ఎక్కువగా తీసుకోవడం ఆ తర్వాత మానేయడం కారణంగా బరువు పెరగడమే కాకుండా మైకం, తలనొప్పి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

ప్రతిరోజు బరువును నియంత్రించుకునే క్రమంలో ఖాళీ కడుపుతో కాఫీని ఎక్కువగా తాగడం వల్ల కొంతమందిలో గుండెపోటు అధిక రక్తపోటుతో పాటు మెదడు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గి రక్త కణాల చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో కాఫీకి బదులుగా గ్రీన్ టీని తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News