Hypertension Home Remedies: బీపీ ఉన్నవారు వానాకాలంలో తప్పకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..

Hypertension Home Remedies: ప్రస్తుతం చాలామందిలో అధిక బీపీ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల బారిన పడ్డవారు తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈ చిట్కాలను పాటించడం వల్ల బీపీ నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2023, 07:25 PM IST
Hypertension Home Remedies: బీపీ ఉన్నవారు వానాకాలంలో తప్పకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..

Hypertension Home Remedies: ప్రపంచంలో ఎక్కువగా వేధించే సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య ఒకటి. ప్రస్తుతం ఈ సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తోంది. దీని కారణంగా చాలామంది జీవితాంతం రసాయనాలతో కూడిన ఔషధాలను వినియోగించాల్సి వస్తుంది. అయితే చాలామందిలో ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలేనన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు జీవన విధానంలో తప్పకుండా పలు రకాల మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతం చాలామంది అతిగా ఉప్పు కలిగిన ఆహారాలను తీసుకుంటున్నారు. ఎక్కువగా ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకునే వారిలో రక్తంలోని ర‌క్త‌నాళాల్లో ఉప్పు పేరుకుపోయి గొడల్లా తయారవుతోంది. దీని కారణంగా చాలామందిలో అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని ఇటీవలే పరిశోధనలో తేలింది. ముఖ్యంగా హైబీపీ సమస్య బారిన పడకుండా ఉండడానికి అతిగా ఉప్పు ఉన్న పదార్థాలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు వానాకాలంలో ఆహారాలు తీసుకునే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే బీపీ పెరిగి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఆహారంలో పొటాషియం అధిక పరిమాణంలో ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బీపీ తగ్గడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 బీపీ ఉన్నవారు ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. వీరు ప్రతిరోజు వ్యాయామాలు కూడా చేయడం శరీరానికి ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాలు, యోగా చేయడం వల్ల శరీరం ఫిట్ గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎంత వీలైతే అంత ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News