Herbal Tea For High BP: మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది హైబీపీతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది హైబీపీని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మందులు వాడాల్సి వస్తుంది. కానీ, కొన్ని మూలికలతో తయారు చేసిన టీ తాగడం వల్ల రక్త పోటును నియంత్రించుకోవచ్చు. అయితే రక్తపోటును అదుపులో ఉంచే హెర్బల్ టీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ
గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీ బరువు అదుపులో ఉంటుంది అని అందరికీ తెలుసు. ఈ సహాయంతో మీ బీపీ కూడా అదుపులో ఉంటుంది. అంటే, మీరు మీ బీపీని సహజ పద్ధతిలో నియంత్రించుకోవచ్చు. కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా గ్రీన్ టీని చేర్చుకోండి.
2. మందార టీ
మందార టీతో కూడా పెరిగిన బీపీ అదుపు చేసుకోవచ్చు. గ్రీన్ టీలాగే ఈ టీలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకునే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.
3. ఊలాంగ్-టీ
ఊలాంగ్ టీ అధిక రక్తపోటులో చాలా మేలు చేస్తుంది. మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని ప్రతిరోజూ తీసుకుంటారని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల హైబీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.
4. వెల్లుల్లి టీ
వెల్లుల్లి టీ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీరు ఈ టీ తాగేప్పుడు చేదు అనుభవం ఎదురవుతుంది. కానీ, ఇది బీపీని నియంత్రణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Ginger Side Effects: అల్లం అతిగా తింటే అనర్ధమే, గుండె, కంటి సంబంధిత సమస్యలుంటాయి జాగ్రత్త..
Also Read: Healthy Breakfast: మెరుగైన ఆరోగ్యం కోసం ఈ బ్రేక్ ఫాస్ట్ లను ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.