వాతావరణం మారినప్పుడు దగ్గు, జలుబు వంటి సమస్యలు సర్వ సాధారణం. ముఖ్యంగా దగ్గు కారణంగా శరీరంలో వివిధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ క్రమంలో ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో కొన్ని రకాల పదార్ధాలు దూరంగా పెట్టడం అవసరం.
చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు అధికమౌతాయి. కొన్నిరకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల దగ్గు మరింతగా పెరుగుతుంది. దగ్గు బాధిస్తున్నప్పుడు ఎలాంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలో చూద్దాం..
దగ్గు ఉన్నప్పుడు తినకూడదని పదార్ధాలు
పాల ఉత్పత్తులు
దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు పాల ఉత్పత్తులకు సాధ్యమైనంతవరకూ దూరంగా ఉండాలి. ఎందుకంటే దగ్గు సమస్య ఉన్నప్పుడు శరీరంలో మ్యూకస్ ఉత్పత్తి పెరిగిపోతుంది. ఫలితంగా దగ్గు పెరుగుతుంది. అందుకే దగ్గు సమస్య బాధిస్తున్నప్పుడు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
మద్యపానం-ధూమపానం
తగ్గు సమస్య ఉన్నప్పుడు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మద్యం లేదా ధూమపానం కారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఫలితంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. వ్యాధుల్నించి దూరంగా ఉండాలంటే..మద్యం, ధూమపానంకు దూరంగా ఉండాలి.
తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి
దగ్గు-జలుబు సమస్య ఉన్నప్పుడు స్వీట్స్ పూర్తిగా మానేయాలి. స్వీట్స్ ఎప్పుడూ బ్యాక్టీరియా, వైరల్ సమస్యల్ని పెంచుతాయి. ఫలితంగా దగ్గు మరింత తీవ్రమౌతుంది. అందుకే స్వీట్స్‌కు దూరంగా ఉండాలి.
అరటిపండ్లు
దగ్గు సమస్య బాధిస్తున్నప్పుడు అరటిపండ్లు సేవించకూడదు. అరటి పండ్లు అదే పనిగా తింటే..బాడీలో మ్యూకస్ పెరిగి..దగ్గు, జలుబు మరింతగా పెరిగిపోతాయి. అందుకే దగ్గు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అరటిపండ్లు అస్సలు తినకూడదు.
Also read: Hip Pain Relief: తుంటి నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook