Garlic Side Effects: వెల్లుల్లి అద్భుతమైన ఔషధం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వెల్లుల్లి సరైన యాంటీ ఆక్సిడెంట్ ఆహారంగా చెప్పవచ్చు. అయితే కొంతమంది మాత్రం వెల్లుల్లిని అస్సలు ముట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లిని దూరం పెట్టాలి. లేకపోతే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవల్సి వస్తుంది.
ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా ఉపయోగకరం. వెల్లుల్లి అనాదిగా వాడుకలో ఉన్న అద్భుతమై యాంటీ ఆక్సిడెంట్ పదార్ధం. వెల్లుల్లితో పెద్ద పెద్ద వ్యాధులు కూడా తగ్గించవచ్చు. కానీ వెల్లుల్లితో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా..కొన్ని వ్యాధుల్లో వెల్లుల్లి తీసుకోవడం హాని కారకమంటున్నారు. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..
వెల్లుల్లి ఎవరెవరు తినకూడదు
ఇటీవల ఏదైనా సర్జరీ చేయించుకున్నవాళ్లు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వెల్లుల్లి అనేది సహజసిద్ధమైన బ్లడ్ థిన్నర్. అంటే రక్తాన్ని పలుచగా చేయడంలో దోహదపడుతుంది. అందుకే తాజాగా ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే మాత్రం వెల్లుల్లి తీసుకోకూడదంటున్నారు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు వెల్లుల్లికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వెల్లుల్లి తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోయే ప్రమాదముంది. అంటే లో షుగర్ సమస్య తలెత్తవచ్చు.
లివర్ అనారోగ్యం, ప్రేవుల సమస్యతో బాధపడేవాళ్లు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. లివర్ వ్యాధిగ్రస్థులు వినియోగించే కొన్ని మందులతో వెల్లుల్లిలోని కొన్ని కారకాలు దుష్పరిణామం చూపిస్తాయి. అందుకే లివర్ వ్యాధిగ్రస్థులు వెల్లుల్లికి దూరంగా ఉండాలి.
Also read: Cholesterol Control Tip: శరీరంలో కొలెస్ట్రాల్ ఎందుకంత ప్రమాదకరం, సులభంగా తగ్గించుకునే మార్గాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook