Winter health tips:చలికాలం.. ఇన్ఫెక్షన్స్ మన మీద ఎక్కువగా దాడి చేసే కాలం. ఈ సీజన్ ఇంట్లో ఎవ్వరూ ఒకరు జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూనే ఉంటారు. ఒక్కసారి ఇది ఇంట్లోకి ఎంటర్ అయిందంటే బయటకు వెళ్లడం ఎంతో కష్టం. అలాగని దీనికోసం కెమికల్స్ తో నిండిన టాబ్లెట్స్ కూడా వాడలేము. ఎందుకంటే మందులు వాడడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందే తప్ప పూర్తిగా నివారించడం కుదరదు. అందుకే మీకోసం సులభంగా జలుబు ,దగ్గు వంటి సమస్యలను ఇంటి వద్ద నుంచే తగ్గించుకునే సులభమైన మార్గం.
మన వంటింట్లో ఎప్పుడు రెడీగా ఉండే అల్లం, మిరియాలు, లవంగాలు, పసుపు.. లాంటివి రోజు వాడడం వల్ల దగ్గు, జలుబు లాంటి ఎన్నో రెస్పిరేటరీ సమస్యలను అదుపులో పెట్టవచ్చు. మనం రోజు తీసుకునే టీ లో ఒక చిన్న ముక్క అల్లం చేర్చుకోవడం వల్ల.. పలు రకాల ఇన్ఫెక్షన్స్ ని దూరంగా పెట్టవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ఉండే తులసి చెట్టు ఆకులు రోజుకు నాలుగు ఐదు నేరుగా అయినా..లేదు టీ లో వేసుకొని అయినా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత అన్ని సమస్యలు దూరం అవుతాయి.
మీకు మామూలు టీ బదులు గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే.. తులసి ,అశ్వగంధ, దాల్చిన చెక్క, లెమన్ ,జింజర్ ఇలా ఎన్నో రకాల ఫ్లేవర్స్ లో మార్కెట్లో గ్రీన్ టీ దొరుకుతుంది. వీటిలో ఏదైనా వెరైటీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని దూరం పెట్టవచ్చు. మీకు రోజు పాలు తాగే అలవాటు ఉంటే అందులో చిటికెడు పసుపు వేసుకొని తాగడం మంచిది. పసుపులో ఉండే సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడంతోపాటు పలు రకాల ఇన్ఫెక్షన్స్ను మన దరిచేరనివ్వవు.
ఈ సీజన్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వీలైనంతగా గోరువెచ్చటి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల జలుబు వచ్చే ఆస్కారం చాలా వరకు తగ్గుతుంది. మొండి దగ్గు ఇబ్బంది పెడుతుంటే.. కాస్త దాల్చిన చెక్క పొడిలో తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. వీలైనంతగా ఆవిరి పడుతూ ఉండాలి. అలాగే రోజు ఫలితముకునేటప్పుడు పొద్దున పూట గోరువెచ్చని నీటిలో కళ్ళు ఉప్పు వేసుకొని బాగా గార్గిల్ చేయాలి. అవసరమైతే ఇందులో కాస్త పసుపు కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ సీజన్లో వచ్చే త్రోట్ ఇన్ఫెక్షన్స్ మన దరి చేరవు.ఈ చిన్నపాటి చిట్కాలను పాటించడంతోపాటు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.కావున ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook