Health Precautions: పిజ్జా అతిగా తింటున్నారా, ఈ ఐదు ప్రమాదకర వ్యాధులతో జాగ్రత్త

Health Precautions: శరీరం ఆరోగ్యం అనేది ఎప్పుడూ మనం తీసుకునే డైట్‌ను బట్టి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆహారపు అలవాట్లు బాగున్నంతవరకే ఆరోగ్యం లక్షణంగా ఉంటుంది. ఇటీవలి ఆధునిక జీవన విధానంలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 4, 2023, 05:21 PM IST
Health Precautions: పిజ్జా అతిగా తింటున్నారా, ఈ ఐదు ప్రమాదకర వ్యాధులతో జాగ్రత్త

Health Precautions: ఇటీవలి ఫాస్ట్ లైఫ్‌లో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత జంక్ ఫుడ్స్‌కు చాలా అలవాటు పడిపోయింది. జంక్ ఫుడ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది పిజ్జా, బర్గర్‌లు. అయితే ఇవి తరచూ తినేవారికి ఆరోగ్యం పెను ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..

ఇటీవలి కాలంలో ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా పిజ్జా, బర్గర్ అంటే వ్యామోహం చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ రెండు ఆహార పదార్ధాలు జంక్ ఫుడ్ కేటగరీలో వస్తాయి. అయితే యవత చాలా ఇష్టంగా తినేది కావడంతో డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పిజ్జా మోతాదుకు మించి తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం రావచ్చు. పిజ్జా అనేది కచ్చితంగా ఒక పాపులర్ ఫుడ్. అదే సమయంలో జంక్ ఫుడ్ ఇది. పిజ్జాకు డిమాండ్, క్రేజ్ ఎక్కువ కావడంతో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా లభిస్తుంది. అయితే పరిమితి దాటితే తీవ్ర ఆనారోగ్య సమస్యలున్నందున అప్రమత్తత చాలా అవసరం.

పిజ్జా అతిగా తినడం వల్ల ఎదురయ్యే ప్రమాదకరమైన సమస్య డయాబెటిస్.ఎందుకంటే పిజ్లాలో వినియోగించే రిపైండ్ కార్బోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ స్థాయిని అకస్మాత్తుగా పెంచేస్తాయి. క్రమంగా ఇది మధుమేహంగా మారుతుంది. మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇది విషంతో సమానం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి అవసరం లేదు. 

పిజ్జా తరచూ తింటే కలిగే మరో ప్రమాదకర వ్యాధి గుండెపోటు ముప్పు. పిజ్లాలో వివిధ రకాల ప్రోసెస్డ్ ఫుడ్స్ కలిపి ఉండటం వల్ల హైపర్ టెన్షన్ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇది కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దాంతో హార్ట్ ఎటాక్ ముప్పు ఏర్పడవచ్చు.

స్థూలకాయానికి ప్రధాన కారణాల్లో పిజ్జా అలవాటు కూడా ఒకటి. ఇందులో కేలరీలు, శాచ్యురేటెడ్, రిఫైండ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. పరిమితికి మించి తింటే కడుపు, నడుము చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. శారీరక వ్యాయామం లేకుంటే స్థూలకాయంగా మారుతుంది. 

పిజ్జాలు అతిగా తీసుకుంటే అజీర్థి సమస్య లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఫలితంగా విరేచనాలు కూడా రావచ్చు. ఇందులో ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం, బ్లోటింగ్ సమస్యలు రావచ్చు.

పిజ్జాలు అదే పనిగా తినడజం వల్ల అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఇందులో ప్రోసెస్డ్ మీట్, పెప్రోనీ, సాస్, ఎక్స్ట్రా ఛీజ్ చాలా పెద్దమొత్తంలో ఉంటాయి. వీటిలో సహజంగానే ఉప్పు అధికంగా ఉంటుంది. మోతాదు మించి పిజ్లా తినడం వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. 

Also read: Knee Pain: మోకాలి నొప్పుల్నించి విముక్తి కల్గించే 5 అద్భుతమైన చిట్కాలు<

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News