Custard Apple Benefits: సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. సీజన్లో లభించే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలుగా రక్షణ కలుగుతుంది. శరీరానికి ఆ సీజన్లో ఎలాంటి పోషకాలు అవసరమో అవి ఆ ఫ్రూట్స్ ద్వారా తప్పకుండా లభిస్తాయి. అందుకే సీజనల్ ఫ్రూట్స్ మిస్ అవకూడదంటారు ఆరోగ్య నిపుణులు.
ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు నోరూరించే అమృతం లాంటి సీతాఫలం గుర్తురాకమానదు. కేవలం శీతాకాలంలో మాత్రమే లభిస్తుంది. సీతాఫలం కల్గించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీ కావు. ఇందులో దాదాపు అన్ని పోషకాలు ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. ఎందుకంటే సీతాఫలంలో విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ బి5 వంటి పోషకాలతో పాటు ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె జబ్బుల్నించి రక్షణ కలుగుతుంది. శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది.
సీతాఫలాల్లో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్త నాళాలు రిఫ్రెష్ అవుతాయి. వదులుగా మారతాయి. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఫైబర్ పెద్దఎత్తున ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తలెత్తదు. మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు శీతాకాలంలో సీతాఫలం తప్పకుండా తినాలి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. దాంతో శీతాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల సీజనల్ వ్యాధుల్నించి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే శీతాకాలంలో సహజంగానే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల సీజనల్ వ్యాధుల ముప్పు అధికంగా ఉంటుంది.
సీతాఫలంలో ఉండే బీ5 కారణంగా మనిషికి మానసిక ప్రశాంతతను కల్గించే సెరిటోనిన్, డోపమైన్ సహా న్యూరో ట్రాన్స్మిటర్ల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి5 లోపిస్తే మానసిక సమస్యలు తలెత్తుతాయి. సీతాఫలం తినడం వల్ల ఈ లోపం నిర్మూలించవచ్చు. సీతాఫలాల్లో పెద్దఎత్తున ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది.
Also read: Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య అంటే ఏమిటి, ఎలా తగ్గించుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook