Neem leaves health benefits: వేప ఆకులతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఆ విషయం తెలియక పెరట్లోనే ఉన్న వేప చెట్టు ఆకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోరు. అయితే, వేప ఆకుల మిశ్రమంతోనూ ( Neem leaves paste ) ఆరోగ్యానికి, శరీర సౌష్టవానికి మేలు చేసే గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఇకపై వేపాకులను వృధాగా పోనివ్వరు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే సహజ పద్ధతిలో ఆరోగ్యానికి ఆరోగ్యం ( Health ).. ఆదాకి ఆదా. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
గాయాలను నయం చేసే దివ్య ఔషదం: వేప ఆకుల నుండి ఒక పేస్ట్ తయారు చేసి, చిన్న చిన్న గాయాలపై ( Wounds ) రోజుకు రెండు లేదా మూడుసార్లు రుద్దితే.. గాయం ఇంకా పెద్దది అవకుండా... సెప్టిక్ అవకుండా నయం అవుతుంది. ( Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )
చుండ్రుకు గుడ్‌బై ( How to check dandruff) : వేప ఆకులు వేసిన నీటిని ఆకు పచ్చగా మారే వరకు ఉడకబెట్టండి. అలా ఆకు పచ్చగా మారిన నీరు చల్లబడే వరకు ఉండి.. ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి. షాంపుతో కడిగిన జుట్టును మళ్లీ చల్లబరిచిన వేపాకు నీటితో ( Neem water ) శుభ్రపరచండి. జుట్టులో ఉన్న చుండ్రు తగ్గుముఖం పడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
కంటి సమస్య ( Eye troubles ) : కళ్లలో మంటగా ఉందా ? కళ్లు అలసటగా ఉండటం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వేపాకులతో సహజ పద్ధతిలో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ( Fruits and vitamins: ఈ పండ్లు తింటే ఇన్ఫెక్షన్, వైరస్‌లకు చెక్ పెట్టొచ్చు)
మొటిమలకు మంచి చికిత్స ( Pimples ): మొటిమలు ఎక్కువగా యుక్త వయస్సులో ఉన్న వారిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. అలాగని వైద్యం కోసం వెళ్లేంత పెద్ద సమస్య కూడా కాదు. దీంతో మొటిమలకు ఎలా చెక్ పెట్టాలో అర్థం కాక చాలా మంది తల పట్టుకుని కూర్చుంటారు. కానీ ఈ వేపాకు మిశ్రమంతో ( Neem paste ) మొటిమలకు కూడా చెక్ పెట్టొచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవును.. కొన్ని వేప ఆకులను రుబ్బి ఒక పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ వేపాకు మిశ్రమాన్ని మొటిమలు ఎండిపోయే వరకు రోజూ అప్లై చేస్తే.. మంచి ఫలితం కనబడుతుంది. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అయ్యే నల్ల మచ్చలు, దీర్ఘకాలిక పూతలకి కూడా ఈ వేపాకు మిశ్రమం సహాయపడుతుంది.
చెవి కురుపులకు చెక్ ( Ear boils ) : కొన్నిసార్లు చెవిపై, చెవు చుట్టూ అయ్యే కురుపులు చాలా నొప్పి పెడుతుంటాయి. సున్నితమైన భాగం కావడంతో ఆ నొప్పి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అయితే, అటువంటి చెవి నొప్పి నివారణకు కూడా వేపాకు మిశ్రమం బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కొన్ని వేప ఆకులను ద్రవ రూపంలో ఒక మిశ్రమంలా చేసి అందులో కొంత తేనె కలపండి. చెవిని ఇబ్బంది పెడుతున్న కురుపులపై ఆ మిశ్రమం నుంచి తీసిన కొన్ని చుక్కలను వేస్తే నొప్పి మాయం అవుతుందట. ( Also read: Health Tips: కరివేపాకు జ్యూస్ తాగారా.. ఈ ప్రయోజనాలు తెలుసా ? )
చర్మ రుగ్మతలు: పసుపును వేప ఆకుల మిశ్రమంతో కలిపి దురద, తామరతో పాటు ఇతర సాధారణ చర్మ సంబంధిత వ్యాధులకు ( Skin disorders ) కూడా ఉపయోగించుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి ( Immunity boosters ): వేప ఆకులను చూర్ణం చేసి ఒక గ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే.. అది రోగ నిరోధక శక్తిని (Immunity power ) పెంచడానికి సైతం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!