Balance Diet Food: ఈ ఆహారం తీసుకుంటే జుట్టు, గోర్లు, చర్మం ఎప్పటికీ సౌదర్యంగా ఉంటాయి..!

Balance Diet Food: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు, మంచి జ్ఞాపక శక్తి పొందేందుకు తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం శరీరం అంతర్గత అవసరాలను తీర్చడమే కాకుండా..శరీరం యొక్క బాహ్య భాగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 12:22 PM IST
  • సమతుల్య ఆహారం శరీరానికి ఎంతో మేలు
  • జుట్టు, గోర్లు, చర్మంలకు లాభాలు
  • పుట్టగొడుగులో ఉండే గుణాలతో కొత్త జుట్టు
Balance Diet Food: ఈ ఆహారం తీసుకుంటే జుట్టు, గోర్లు, చర్మం ఎప్పటికీ సౌదర్యంగా ఉంటాయి..!

Balance Diet Food: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు, మంచి జ్ఞాపక శక్తి పొందేందుకు తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం శరీరం అంతర్గత అవసరాలను తీర్చడమే కాకుండా..శరీరం యొక్క బాహ్య భాగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. చర్మం, జుట్టు, గోర్లు వంటి భాగాలకు మంచి సౌందర్యాన్ని చేకూర్చుతుందని నిపుణులు తెలిపారు. విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల శరీరానికి మంచి మేలు జరుతుందని సూచించారు. గోళ్లు, వెంట్రుకలు, చర్మం సౌదర్యంగా ఉండేందుకు మంచి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రౌన్ రైస్(నల్ల బియ్యం):  సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన నల్ల బియ్యానే బ్రౌన్ రైస్‌ అని అంటారు. బ్రౌన్ రైస్‌లో వివిధ రకాల బయోటిన్, నీటిలో కరిగే బి విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టు, గోళ్లకు చాలా మేలు చేస్తాయి.  జుట్టు, గోర్లు దెబ్బతినకుండా, బలహీనపడకుండా బ్రౌన్ రైస్ కాపాడతాయి. ఇదే కాకుండా దీనికి బదులుగా గోధుమలు కూడా తిసుకోవచ్చని నిపుణులు తెలిపారు.

కోడి గుడ్డు: గుడ్డులో చాలా రకాల ప్రొటీన్లు ఉంటాయి. అందుకే దీనిని నిపుణులు ప్రొటీన్ల రాజు అని పిలుస్తారు. అయితే ఇందులో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు లభిస్తాయి. ఇవి మన తల వెంట్రుకలకు  ప్రొటీన్లను అందిస్తాయి. అంతే కాకుండా ప్రతిరోజూ అల్పాహారంలో గుడ్లు తినాలని ఆరోగ్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది.

క్యారెట్లు: క్యారెట్లలో విటమిన్-ఎ  ఉంటుంది. కావున ఈ క్యారెట్లు మానవ చర్మానికి కావాల్సిన  విటమిన్-ఎ ను పుష్కలంగా అందిస్తుంది. ఇది వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఎంతో సహాయ పడుతుందని నిపుణులు తెలిపారు. దీనిని హల్వా చేసుకొని లేదా గ్రైండింగ్ చేసి జ్యూస్‌ తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయని సూచించారు.

బాదం: బాదం మన శరీరానికి మంచి పోషకాలను ఇస్తుంది. ఇందులో బయోటిన్ కూడిన పోషక విలువలుండడం వల్ల ఇవి శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూర్చుతాయని నిపుణులు తెలిపారు. బాదంలో ఉండే గుణాలతో గోళ్లను బలంగా చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్-ఇ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేస్తుంది.

చేపలు: చేపల్లో విటమిన్-డి ఉంటుంది. ఇందులో ఉండే కొవ్వు చర్మానికి జుట్టుకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ చేపలన్నీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉండడం వల్ల శరీరానికి, జుట్టుకి మంచి లాభాన్ని ఇస్తుంది. 

పుట్టగొడుగులు: వీటిలో విటమిన్-డి  పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు బలాన్ని, మెరుపును ఇస్తుంది. పుట్టగొడుగులపై 'స్టే సేల్స్ జర్నల్స్' అధ్యయనాల ప్రకారం...ఇవి కొత్త జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతాయని వెల్లడింది.

కివి:  ప్రస్తుతం కివి పండ్లు మార్కెట్‌లో విచ్చల విడిగా లభిస్తున్నాయి. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  కివిలో ఉండే ప్రొటీన్లు చర్మ సౌదర్యానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. దీనికి చర్మపై ముడతలను తొలగించే గుణముందని పేర్కొన్నారు. ఇందులోని ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మృదువైన చర్మానికి చాలా మేలు చేస్తాయి. 

Also Read: Pulwama Encounter: పుల్వామాలో భారీ ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం!

Also Read:  Sarkaru Vaari Paata Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'సర్కారు వారి పాట' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News