Guava Leaves Tea For Belly Fat And Weight Loss: ప్రస్తుతం ఏ సీజన్లోనైనా జామకాయలు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. వీటి రుచి బాగుండడం వల్ల తినడానికి అందరూ ఇష్టపడతారు. ప్రస్తుతం చాలామంది జామకాయలనే కాకుండా జామ పండ్లను కూడా అధికంగా తింటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామకాయలు శరీరానికి కావాల్సిన విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలోని పోషక విలువల స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఏ సీజన్లోనైనా జామకాయలను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటిని చలికాలంలో తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చలికాలంలో జామకాయలను ఆహారంలో భాగంగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అన్ని సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలైనా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి.
జామకాయలే కాకుండా జామ ఆకులు కూడా శరీరానికి ప్రయోజనాలు చేకూర్చుతాయి. జామకాయల కంటే జామ ఆకుల్లో రెట్టింపు విటమిన్ల శాతం ఉంటుందని.. వీటిని క్రమం తప్పకుండా టీలో వినియోగించడం వల్ల బెల్లీ ఫ్యాట్, బరువును కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జావా ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయి.
ఈ జామ ఆకుల టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..:
ముందుగా చాలా ఆకుల టీ ని తయారు చేసుకోవడానికి నాలుగు నుంచి ఐదు చాలా ఆకులను తీసుకోవాలి. ఆకులను తీసుకున్న తర్వాత రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసి.. గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఇక ఇదే టిని బరువు తగ్గడానికి అదనంగా నిమ్మకాయను జోడించాల్సి ఉంటుంది. ఇలా వీటిని ఉదయం సాయంత్రం మూడు పూటలు తాగితే శరీరంలో అన్ని అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chiru Vs Balayya: అన్ని విషయాల్లో బాలయ్యను డామినేట్ చేస్తున్న చిరు.. ఆ దెబ్బతో సినిమా కూడా ముందే?
Also Read: Samantha Hugs: అతని కౌగిట్లో సమంత.. ఈరోజు వస్తుందని ఊహించలేదంటూ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook