Green Tea Vs Lemongrass Tea: ఈ రెండింటిలో ఏ టీ 15 రోజుల్లో బరువు తగ్గిస్తుంది?

Green Tea Vs Lemongrass Tea For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ టీలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను కూడా కరిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 12, 2024, 04:41 PM IST
Green Tea Vs Lemongrass Tea: ఈ రెండింటిలో ఏ టీ 15 రోజుల్లో బరువు తగ్గిస్తుంది?

Green Tea Vs Lemongrass Tea For Weight Loss: ప్రస్తుతం బరువు తగ్గడం అనేది పెద్ద సమస్యగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా అతి తక్కువ వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. బరువు తగ్గడానికి ప్రస్తుతం చాలా మంది జిమ్ముల్లో గంటల తరబడి వ్యాయామాలు, కఠినమైన డైట్‌లను ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. వీటికి బదులు చాలా మంది గ్రీన్‌ టీలను, లెమన్‌ గ్రాస్‌ టీలను తాగుతున్నారు. అయితే వీటిని తాగడం వల్ల సులభంగా వెయిట్‌ లాస్‌ అవుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ టీని ఎక్కువగా తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో తెలుసుకుందాం.

గ్రీన్ టీ vs లెమన్ గ్రాస్ టీ:
గ్రీన్ టీ:
మెటబాలిజం పెంచుతుంది: 

గ్రీన్ టీలో శరీరానికి కావాల్సిన కెఫీన్‌తో పాటు ఫ్లేవనాయిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజాన్ని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఈ టీని తాగడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

కొవ్వు కరిగించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది: 
గ్రీన్ టీలోని లభించే కొన్ని ఔషధ గుణాలు శరీరంలోని కొవ్వు కరిగించే ఎంజైమ్‌లను విడుదల చేయడానికి సహాయపడతాయి. దీని కారణంగా బరువు కూడా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

ఆకలి నియంత్రిస్తుంది: 
గ్రీన్ టీ తాగడం వల్ల ఆకలిని కూడా నియత్రిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. అలాగే ఈ టీని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఆకలి నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 

లెమన్ గ్రాస్:
వాపులను తగ్గింస్తుంది: 

లెమన్ గ్రాస్‌లో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర బరువు తగ్గించే కొన్ని హార్మోన్‌లను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ టీని తాగడం వల్ల గ్రీన్‌ టీ లాగా సులభంగా బరువు తగ్గకపోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

డీటాక్స్‌గా పనిచేస్తుంది: 
లెమన్ గ్రాస్ టీ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు తాగడం వల్ల శరీర బరువు నియత్రణలో ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఈ రెండు టీలో బెస్ట్‌ టీ ఇదే:
బరువు తగ్గించడానికి గ్రీన్ టీ, లెమన్ గ్రాస్ రెండూ  మంచివే.  గ్రీన్ టీ తాగడం వల్ల మెటబాలిజాన్ని పెరుగుతుంది. దీని కారణంగా నేరుగా కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పరోక్షంగా బరువు తగ్గుతారు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News