Garlic Side Effects: వెల్లుల్లి మోతాదు మించితే కలిగే దుష్పరిణామాలివే

Garlic Side Effects: వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తీసుకుంటే అన్ని దుష్పరిణామాలుంటాయి. వెల్లుల్లి అధికంగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 22, 2022, 06:34 PM IST
Garlic Side Effects: వెల్లుల్లి మోతాదు మించితే కలిగే దుష్పరిణామాలివే

భారతీయుల వంటల్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వంటల రుచి పెరిగేందుకు వినియోగిస్తుంటారు. అదే సమయంలో ఆరోగ్యానికి వెల్లుల్లి కల్గించే లాభాలు అనేకం. కానీ వెల్లుల్లితో దుష్పరిణామాలు కూడా ఉన్నాయి..

ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి అద్భుతమైన ఔషధమే కాకుండా..వంటల రుచిని కూడా పెంచుతుంది. ఇందులో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యమంగా విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ , ఐరన్ ఉన్నాయి. అని న్యూట్రియంట్లు ఉన్నా..అతిగా తింటే మాత్రం వెల్లుల్లి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం.

వెల్లుల్లి ఎందుకు ఎక్కువగా తీసుకోకూడదు

వెల్లుల్లిలో ఆయుర్వేదపరంగా అత్యద్భుత ఔషధం. అధికంగా సేవిస్తే దుష్పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుంది. అందుకే వెల్లుల్లిని మితంగా వాడాలి. వెల్లుల్లి గుణం రీత్యా వేడి చేస్తుంది. అందుకే జలుబు సంబంధిత వ్యాధుల నివారణకు వెల్లుల్లి రెమ్మల్ని తినమంటారు. అయితే వెల్లుల్ని తింటే నోటి నుంచి ఓ విధమైన దుర్గంధం వ్యాపిస్తుంది. అందుకే పరిమితమోతాదులో తీసుకోవాలి.

లో బీపీ ఉన్నవాళ్లు వెల్లుల్లి వాడకూడదు. ఎందుకంటే వెల్లుల్లితో లో బీపీ సమస్య తలెత్తతుంది. ఫలితంగా శరీరంలో బలహీనత, అలసట ఉంటుంది. అందుకే కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే గుండె మంట ఉంటుంది. వెల్లుల్లిలో ఎసిడిక్ కాంపౌండ్ ఉంటుంది. అందుకే అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఛాతీలో మంట సమస్య రావచ్చు. ఒక్కొక్కసారి భరించలేని సమస్యగా పరిణమించవచ్చు. అందుకే అప్రమత్తత చాలా అవసరం.

Also read: Weight Loss Tips: స్నాక్స్‌ని ఇలా ప్రతి రోజూ తీసుకుంటే దెబ్బకు 7 రోజుల్లో బరువు దిగి వస్తుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News