Curd Rice : పెరుగన్నం నచ్చదా? ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!

Benefits of Eating Curd: కొంతమందికి పెరుగు అన్నం చాలా నచ్చుతుంది. పెరుగన్నం లేకపోతే.. లంచ్ లేదా డిన్నర్ పూర్తయినట్లు ఉండదు. కానీ కొందరు మాత్రం పెరుగు అనగానే పారిపోతూ ఉంటారు. అలాంటివారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేతులారా పోగొట్టుకుంటున్నట్లే. ఎందుకంటే పెరుగన్నం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 6, 2024, 02:24 PM IST
Curd Rice : పెరుగన్నం నచ్చదా? ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!

Curd Rice Benefits : ఎన్ని రకాల కూరలతో తిన్నప్పటికీ.. పెరుగన్నం తినకుండా అసలు భోజనం చేసిన అనుభూతి కలగదు. పిల్లలు నుంచి పెద్దల దాకా చాలామంది పెరుగన్నం ఇష్టంగా తింటారు. ఆఖరికి హోటల్ కి వెళ్లి తిన్నప్పటికీ.. ఆఖరిలో పెరుగన్నం తినే బయటకువస్తారు. అయితే కొంతమంది మాత్రం పెరుగుని దూరం పెడుతూఉంటారు. అలాంటి వాళ్ళు పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తప్పక తెలుసుకోవాలి అంటున్నారు వైద్యనిపుణులు ‌ 

బోలెడన్ని ప్రయోజనాలు..

ఉట్టి పెరగని మాత్రమే కాకుండా.. దాన్ని తాలింపు పెట్టి.. చక్కగా ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పెరుగు లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ పొట్ట సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి రోగాలకి పెరుగన్నం చెక్ పెడుతుంది. మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాతో పోరాదే శక్తి పెరుగన్నానికి ఉంది. 

పెరుగన్నంలో ప్రోటీన్ తో పాటు కాల్షియం, మినరల్స్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా ఇస్తాయి. అంతేకాకుండా పెరుగుకి చెడు కొవ్వుతో పోరాడే ఆరోగ్య శక్తి కూడా ఉంటుంది. రోజుకి ఒకసారి లేదా రెండు సార్లు పెరుగన్నం తినడం వల్ల.. బ్లడ్ ప్రెషర్ కూడా చాలా వరకు నియంత్రించవచ్చు. 

పెరుగన్నంలో తినడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గొచ్చు. పెరుగన్నం మన శరీరంలోని మెటబాలిజం వేగవంతంగా మారుస్తుంది.. పైగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగన్నం కొంచెం తిన్నా.. కడుపు నిండుగా అనిపించి ఆకలి తగ్గుతుంది. ఇక పెరుగన్నం లో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగన్నం వల్ల బరువు కూడా తగ్గుతాం. అసలే వేసవికాలం కాబట్టి.. చలువు చేసే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ విషయంలో పెరుగన్నానికి మించింది మరొకటి ఉండదేమో. పెరుగన్నం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. బయట ఎండలు మండిపోతున్నప్పటికీ.. మన ఒంటిని పెరుగన్నం కూల్ గా ఉంచుతుంది. 

ఇలా పెరుగన్నం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. దానిని తాలింపు పెట్టుకొని తిన్నా లేక దానిపై ఫ్రూట్స్ చల్లుకుని తిన్నా రుచికి రుచితో పాటే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News