Fennel Seeds For Weight Loss: సోంపు నీటితో సులభంగా బరువు తగ్గడం ఎలాగో తెలుసా? ఇలా 10 రోజుల్లో చెక్‌!

Fennel Seeds For Weight Loss In 8 Days: బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఊబకాయం తగ్గించుకోవలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2023, 02:34 PM IST
Fennel Seeds For Weight Loss: సోంపు నీటితో సులభంగా బరువు తగ్గడం ఎలాగో తెలుసా? ఇలా 10 రోజుల్లో చెక్‌!

 

Fennel Seeds For Weight Loss In 8 Days: బరువు తగ్గడం ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసిందే. బరువు పెరగడం సులభమైనప్పటికీ.. బరువు తగ్గేందుకు ఎంతో కఠినతర వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఆహారాలను డైట్‌ పద్దతిలో తీసుకుంటు ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతారు. అయితే శరీర బరువును వేగంగా, ఆరోగ్యంగా తగ్గించుకోవాలనుకునేవారి కోసం మేము ఈ రోజు ఒక హోమ్‌ రెమెడీని మీ ముందుకు తీసుకు వచ్చాం. దీనిని వినియోగించడం వల్ల బరువు తగ్గడమేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు మౌత్ ఫ్రెషనర్‌గా వినియోగించే సోంపును ప్రతి రోజు వాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే బరువు తగ్గే క్రమంలో దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సోంపు ద్వారా కూడా బరువు తగ్గొచ్చా?:
చాలా మంది సోంపును మౌత్ ఫ్రెషనర్‌గా వినియోగిస్తారు. ఇది ప్రతి రోజు నమలడం ద్వారా నోటి నుంచి వచ్చే చెడు వాసను సులభంగా తగ్గిస్తుంది. అంతేకాకుండా పెరుగుతున్న శరీర బరువును కూడా సులభంగా నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ప్రతి రోజు ఇలా చేయండి:
పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రతి రోజు నానబెట్టిన సోంపు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజు చిన్న కప్పులో సోంపును తీసుకుని అందులోనే నీటిని వెసుకుని కానీసం 6 నుంచి 7 గంగట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన నీటిని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టు పేరుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..​ 

వేయించిన సోంపు గింజలు:
వేయించిన సోంపు గింజలను పొడిలా తయారు చేసుకుని అందులో కప్పు నల్ల బెల్లాన్ని కలిపి ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా కరిగిస్తాయి. 

సోంపు టీ:
వేయించిన సోంపును టీలాగా తయారు చేసుకుని తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఊబకాయం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్నవారు ప్రతి రోజు సోంపు టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News