Mokkajonna Roti For Weight Loss: శీతాకాలం రాగానే చాలామంది తీసుకునే ఆహారాలు పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. లేకపోతే అనారోగ్యకరమైన ఆహారాలని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని ఆహార చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చాలామంది రోటీలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా బాడీని శీతాకాలంలో దృఢంగా ఉంచేందుకు సహాయపడతాయి.
ప్రతిరోజు ఆహారంలో భాగంగా మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. మొక్కజొన్న లో ఉండే మాంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలీనియం, విటమిన్ ఎ శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ మొక్కజొన్న రోటీస్‌ను చలి కాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొక్కజొన్న రొట్టె తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రక్తహీనత సమస్యలకు చెక్:
చలి కాలంలో చాలా మంది స్త్రీలు ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు కూడా సులభంగా తగ్గుతాయి. వీటి కారణంగా చాలా మందిలో ఐరన్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు మొక్కజొన్నతో తయారు చేసిన రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని ఐరన్ శాతాన్ని సులభంగా పెంచుతాయి.
రక్తపోటు నుంచి ఉపశమనం:
కార్న్ పిండితో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా రక్తపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ బి అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి శీతాకాలంలో తరచుగా అనారోగ్యలతో బాధపడేవారు ప్రతి రోజు మొక్కజొన్న రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read:Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
మలబద్ధకం నుంచి ఉపశమనం:
మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పరిమాణంలో పీచు లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.
బరువు తగ్గడం:
బరువు తగ్గాలనుకునేవారు కూడా చలి కాలంలో మొక్కజొన్న పిండితో తయారు చేసిన రోటీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందేలో ఉండే గుణాలు, పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరిచి శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఆకలిని తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
Also Read:Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook