Dry Fruits For Weight Loss: నట్స్ శరీరానికి చాలా మంచివి..వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అయితే డ్రై ఫ్రూట్స్‌ను ఎండలో ఆరబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి రెట్టింపు లాభాలు కలుగుతాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ఇలా సూర్యకాంతిలో ఆరబెట్టి తీసుకోవడం వల్ల నట్స్‌లో శక్తి రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వాటి ఉష్ణోగ్రత శాతం కూడా పెరిగి పోషకాలను అధిక పరిమాణంలో అందించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా నట్స్‌లో లభించే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శాతం కూడా రెట్టింపు అవుతాయి. వీటి వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
ఇతర సీజన్లతో పోలిస్తే ఈ శీతాకాలంలో చాలా మంది అనారోగ్యానికి గురవుతారు. ముఖ్యంగా చిన్నవారి నుంచి మొదలు కొని పెద్దవారి వరకు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల బారిన పడతారు. అయితే ఇవన్నీ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం పూట నట్స్ తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విటమిన్ సిని అందించే ఆహారాలు కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇలా ప్రతి రోజు తీసుకోవడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
శరీర వెచ్చధనం కోసం:
డ్రై ఫ్రూట్స్‌లో అనేక రకాల ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. అయితే చాలా మందిలో ఉష్ణోగ్రత తగ్గుదల గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో లభించే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
వెయిట్ లాస్:
డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి శీతాకాల్లో వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ వీటిలో క్యాలరీలు అంత ఎక్కువగా ఉండవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
మానసిక శక్తిని పెంచుతాయి:
డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి అదనంగా లభించడమే కాకుండా మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయం అల్పాహారంలో భాగంగా 4-5 రకాల డ్రై ఫ్రూట్స్ తింటే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి