Diabetes Control Tips: డయాబెటిస్ ఉన్నవారు తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా? రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం ఖాయం!

How To Diabetes Control: డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు పాటించే జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 28, 2023, 02:32 PM IST
Diabetes Control Tips: డయాబెటిస్ ఉన్నవారు తిన్న వెంటనే ఇలా చేస్తున్నారా?  రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం ఖాయం!

How To Diabetes Control: మధుమేహం ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ప్రతి 20 కుటుంబాల్లో 18 కుటుంబాల సభ్యుల్లో ఒక్కరు, ఇద్దరైనా డయాబెటిస్ మారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలిని అనుసరించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది రక్తంలోని చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోలేకపోవడం వల్ల మూత్రపిండాలు వైఫల్యం, గుండెపోటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి:
ప్రస్తుతం డయాబెటిస్తో బాధపడేవారు రాత్రి పూట భోజనం చేసిన వెంటనే నిద్రపోతున్నారు. ఇలా నిద్రపోవడం వల్ల తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే రాత్రి భోజనం చేసిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది. ఇలా నడవడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా నడుము చుట్టూ కొడస్ట్రాల్ తగ్గి ఊబకాయం సమస్య బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు నిద్రపోయే రెండు గంటలకు ముందు ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా

డయాబెటిస్తో బాధపడేవారు ఎప్పుడు ఎక్కువ ఆకలితో ఉండడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల రక్తంలోని గ్లూకోస్ స్థాయిలపై ప్రభావం పడి రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. ఇదే కాకుండా ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఆకుపచ్చని కూరగాయలతో పాటు పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్లే శరీరం ఆరోగ్యంగా దృఢంగా తయారవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్:
డిన్నర్ తర్వాత తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఉదయాన్నే లేచి వ్యాయామాలతో పాటు యోగాను చేయడం వల్ల బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఓకే డయాబెటిస్తో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News